kajal: ఆ విషయాన్ని ప్రతీరోజూ గుర్తుంచుకోవాలని చెబుతోన్న చందమామ.. ఆసక్తిర పోస్ట్ చేసిన కాజల్‌.

|

Jul 16, 2021 | 7:09 AM

kajal aggarwal: 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అందాల తార కాజల్‌ అగర్వాల్‌. తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా...

kajal: ఆ విషయాన్ని ప్రతీరోజూ గుర్తుంచుకోవాలని చెబుతోన్న చందమామ.. ఆసక్తిర పోస్ట్ చేసిన కాజల్‌.
Kajal Aggarwal
Follow us on

kajal aggarwal: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అందాల తార కాజల్‌ అగర్వాల్‌. తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా ‘చందమామ’తో తెలుగు ఆడియన్స్‌కు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బడా సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేశారు కాజల్‌. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిన కాజల్‌ కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించారు.

ఇక వివాహం తర్వాత కూడా సినిమాల్లో ఏ మాత్రం జోరు తగ్గించలేరు కాజల్‌. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు కాజల్‌. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకునే కాజల్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్‌ చేశారు.
తలకు ఎల్లో కలర్‌ బ్యాండ్ పెట్టుకొని కాఫీ తాగుతోన్న సమయంలో తీసిన ఓ క్లోజప్‌ ఫొటోను పోస్ట్ చేసిన కాజల్‌.. ‘కొన్ని సింపుల్‌ విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.. అదే చిరునవ్వు’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించారు. కాజల్‌ చేతిలో పట్టుకున్న కప్‌పై ‘హ్యాపీ స్మైల్‌’ అనే కొటేషన్‌ రాసుంది. ఇలా.. జీవితం హాయిగా గడవాలంటే రోజూ చిరు నవ్వు తప్పనిసరి అనే విషయాన్ని కాజల్‌ చెప్పకనే చెప్పారు. ఇటీవల ‘హాట్‌ స్టార్‌’లో విడుదల అయిన ‘లైవ్‌ టెలికాస్ట్‌’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను భయపెట్టిచ్చిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. దీంతో వివాహం తర్వాత కాజల్‌ సినిమాలు తగ్గించనుందని గతంలో వచ్చిన వార్తలకు కాజల్‌ తన సినిమాలతోనే సమాధానం చెప్పారన్నమాట.

కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

Also Read: Sania Mirza: సానియా మీర్జాకు దుబాయ్ గోల్డెన్ వీసా.. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణీ

Corona Third Wave: ఆగస్టు చివరిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త

Rain Alert: నేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.