నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. చందమామ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. అయితే కెరీర్ మంచి పాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని సెటిలైంది టాలీవుడ్ చందమామ. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయడానికి సిద్ధమేనని చెప్పింది. అలా.. వివాహం చేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆచార్య సినిమాలో నచించింది కాజల్.
అయితే గత కొద్ది రోజులుగా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇదే కారణం చేత.. కాజల్.. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకోవడమే కాకుండా.. మరిన్ని ప్రాజెక్టులను కూడా రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 నుంచి కూడా కాజల్ తప్పునట్లుగా సమాచారం. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలను గతంలోనే ఖండించింది కాజల్. తన ప్రెగ్నెన్సీ గురించి ఏం మాట్లాడాలని అనుకోవడం లేదని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాజల్.
ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ తన ఇన్స్టా స్టోరీలో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలలో కాజల్ బేబీ బంప్ కనిపిస్తోంది. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి కాజల్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఇప్పుడు కాజల్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతుండడంతో త్వరలోనే కాజల్ ఈ విషయంపై అధికారికంగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు నెటిజన్స్.
Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..