Hema: అందుకే సినిమాలు చేయడంలేదు.. అసలు విషయం చెప్పిన హేమ

|

Feb 12, 2023 | 7:43 AM

దాదాపు చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి అలరించింది హేమ. ఈ మధ్యకాలంలో హేమ సినిమాల్లో కనిపించడం లేదు.

Hema: అందుకే సినిమాలు చేయడంలేదు.. అసలు విషయం చెప్పిన హేమ
Hema
Follow us on

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు హేమ. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హేమ. హేమ , బ్రహ్మానందం  కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఏ పాత్రయినా ఇటే ఒదిగిపోయే హేమ ఇటీవల సినిమాలు తగ్గించారు. దాదాపు చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి అలరించింది హేమ. ఈ మధ్యకాలంలో హేమ సినిమాల్లో కనిపించడం లేదు. అయితే సినిమాల్లో కనిపించకపోవడంతో తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు హేమ.. ఆ కారణంతోనే సినిమాల్లో నటించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు హేమ. ఇంతకు ఆ కారణం ఏంటంటే ..

ఇక హేమ సినిమాల్లో కనిపించకపోవడం పై మీడియా ప్రశ్నించగా.. ఈ మధ్య కొత్త బిజినెస్ పెట్టాను.. అందులో సంపాదన ఎక్కువ అవడంతో.. సుఖ పడటం అలవాటు అయిపోయింది.. అందుకే కష్టపడాలని అనిపించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక హేమ మా ఎన్నికల్లో చాలా హుషారుగా పాల్గొన్న విషయం తెలిసిందే. మా ప్రసిడెంట్ గా నామినేషన్ వేసి ఆతర్వాత ఉపసంహరించుకున్నారు హేమ. ఆ టైమ్ లో హేమ ఎక్కువగా వార్తల్లో నిలిచారు.