తండ్రి భుజాలపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..

|

Dec 20, 2021 | 3:57 PM

హీరోయిన్స్ అంటే కుర్రాళ్లకు కలల రాకుమారిలు.. ఊర్వశి రంభ మేనకా ఎలా ఉంటారో తెలియక పోయినా.. తమ అభిమాన హీరోయిన్స్ నే ఊర్వశి రంభ మేనకాలుగా ఊహించుకుంటూ ఉంటారు..

తండ్రి భుజాలపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..
Hamsanandini
Follow us on

హీరోయిన్స్ అంటే కుర్రాళ్లకు కలల రాకుమారిలు.. ఊర్వశి రంభ మేనకా ఎలా ఉంటారో తెలియక పోయినా.. తమ అభిమాన హీరోయిన్స్ నే ఊర్వశి రంభ మేనకాలుగా ఊహించుకుంటూ ఉంటారు.. వారికీ సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తమ సొంత విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్. ఇక తమ బెడ్ రూమ్స్‌లో.. ఫోన్‌లలో ఆ హీరోయిన్స్‌కు సంబంధించిన ఫోటోలు దాచుకుంటూ ఉంటారు. వారి చిన్న నటి ఫొటోలను కూడా భద్రంగా దాచుకుంటారు.. అంతే కాదు. తమ ఫ్యావరెట్ హీరోయిన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పదిమందితో పంచుకుంటూ ఉంటారు.. ఇలా ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తండ్రి బుజాల పై మహారాణిలా కూర్చొని నవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే షాక్ అవుతారు.

పై ఫొటోలో బూరె బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో కాదు.. ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ అప్పుడప్పుడు స్పెషల్స్ సాంగ్స్ లో నటిస్తూ మెప్పిస్తున్న హంసానందిని. వంశీ తెరకెక్కించిన అనుమానాస్పదం సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది హంసానందిని . ఆతర్వాత ఈ అమ్మడికి హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు క్యాన్సర్ తో పోరాడుతుంది. నాలుగు నెలల క్రితం నుంచే ఈ మహమ్మారి తనను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చిన హంసా నందిని.. ఆపరేషన్‌ చేసి క్యాన్సర్ను తొలగించారని.. ప్రస్తుతం కీమోథెరపీ చేయించుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే 9 సైకిల్స్‌ కీమోథెరిపీ పూర్తైందని.. మరో 7 సైకిళ్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయన్నారు. అందుకే తాను ఇలా అయ్యానని.. గుండుతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు నందిని.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa : బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న ‘పుష్ప’ రాజ్.. రెండు రోజుల్లోనే సరికొత్త రికార్డ్..

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..

Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..