Geeta Singh: 22 లక్షలు మోసపోయాను.. సూసైడ్ అటెంప్ట్ చేశాను.. గీతా సింగ్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

జై సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గీతా సింగ్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో గీతా ఒకరు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

Geeta Singh: 22 లక్షలు మోసపోయాను.. సూసైడ్ అటెంప్ట్ చేశాను.. గీతా సింగ్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
Geeta Singh

Updated on: Sep 06, 2025 | 9:20 AM

గీతా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జై సినిమాతోతెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తనదైన కామెడీ టైమింగ్, నటనతో జనాలను కడుపుబ్బా నవ్వించింది.ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన కితకితలు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఈ మూవీతో గీతా సింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే గీతా సింగ్ సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఫ్యామిలీ సమస్యలతో సినిమాలకు దూరమైన ఆమె.. ఇప్పుడు మళ్లీ నటించేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తిరిగి యాక్టివ్ అవుతుంది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలు పంచుకుంది. అలాగే ఇండస్ట్రీలో తనకు ఎదురైన మోసం గురించి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..

గీతా సింగ్ మాట్లాడుతూ.. చనిపోవాలనుకున్నానని.. రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమలోనే బాగా తెలిసిన ఒక మహిళ దగ్గర చీటీ వేశాను.. 22 లక్షల దాకా చిట్టి కట్టానని.. అవసరం అయి వాళ్లింటికి వెళ్లి అడిగితే.. రెడీ చేస్తానని చెప్పింది… కానీ నేను వాళ్లింటికి వెళ్లినప్పుడు సామాన్లు ఏమి లేవు.. అడిగితే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పింది.. కానీ రాత్రికి రాత్రే పారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. రూపాయి రూపాయి దాచుకొని వాళ్లకు ఇస్తే మోసం చేశారు. దాదాపు 8 ఏళ్లు అవుతుంది ఇది జరిగి.. ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తుంది. కానీ ఆమె పట్టించుకోదు. ఆమెను చూస్తే కొట్టాలనిపిసతుంది. ఒక అమ్మాయే ఇంకో అమ్మాయి బాధను అర్థం చేసుకోకపోతే ఎలా.. నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మా అక్క వచ్చి తిట్టి లైన్లో పెట్టంది “అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..