బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దిశా పటానీ (Disha Patani) ఒకరు. భాగీ 2, భాగీ 3, రాధే, ఎంఎస్ ధోనీ వంటి సూపర్ హిట చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయమైంది దిశా. ఈ మూవీ తర్వాత తెలుగులో దిశాకు అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)..డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కె (Project K) సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమానే కాకుండా దిశా పటానీ బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దిశా.. ప్రాజెక్ట్ కె సినిమాపై, ప్రభాస్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ప్రాజెక్ట్ కె సినిమా గురించి దిశా పటానీ మాట్లాడుతూ.. ” నేను ఇప్పటివరకు నేను పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. అతను చాలా నిరాడంబరుడు. ప్రాజెక్ట్ కె మొదటి రోజు షూట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఉదయం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఇచ్చాడు. నాకే కాకుండా మొత్తం టీంకు అతను భోజనం అందించాడు. ప్రభాస్ తో పనిచేయడం చాలా సులభం.
నాకు ఆసక్తి కలిగించేవి లేదా ఏదో ఒక ప్రదేశంలో నన్ను ఆకర్షించాయని అనిపించే పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉంటాను. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ” అంటూ చెప్పుకొచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలకపాత్రలలో నటించారు.