Dimple Hayathi: బంపర్ ఆఫర్ కొట్టేసిన డింపుల్ హయాతి ?.. బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్..
ఇటీవల అఖండ సినిమాతో సంచలనం సృష్టించిన బాలకృష్ణ ప్రస్తుతం.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది డింపుల్ హయాతి (Dimple Hayathi). ఇటీవలే మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో గోపీచంద్ సరసన లక్ష్యం 2లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించి ఛాన్స్ వచ్చిందని ఫిల్మ్ సర్కి్ల్లో వార్త చక్కర్లు కొడుతుంది.
ఇటీవల అఖండ సినిమాతో సంచలనం సృష్టించిన బాలకృష్ణ ప్రస్తుతం.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మాస్ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. లేటేస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ పాట కోసమే ఇప్పుడు డింపుల్ హయాతిని ఎంచుకున్నారట మేకర్స్.. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్లో బాలయ్య, డింపుల్ హయాతిలపై పాట చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం.. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది… వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.