AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanya Balakrishna : 12 ఏళ్ల క్రితం పోస్ట్.. ఇప్పుడు క్షమాపణ చెప్పిన హీరోయిన్.. ఎందుకంటే..

ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ కీలకపాత్ర పోషించింది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ధన్య.. తాజాగా తమిళ్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. దాదాపు 12 ఏళ్ల క్రితం పెట్టిన పోస్ట్ పై ఇన్నాళ్లకు వివరణ ఇచ్చింది. తనకు తమిళ అడియన్స్ అంటే ఎంతో గౌరవమని.. అప్పట్లో పెట్టిన పోస్టుకు.. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. తమిళ ప్రజలను ఉద్దేశిస్తూ తాను ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది.

Dhanya Balakrishna : 12 ఏళ్ల క్రితం పోస్ట్.. ఇప్పుడు క్షమాపణ చెప్పిన హీరోయిన్.. ఎందుకంటే..
Dhanya Balakrishna
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2024 | 5:33 PM

Share

ధన్య బాలకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. చాలా కాలంగా తెలుగులో కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె లాల్ సలామ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ కీలకపాత్ర పోషించింది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ధన్య.. తాజాగా తమిళ్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. దాదాపు 12 ఏళ్ల క్రితం పెట్టిన పోస్ట్ పై ఇన్నాళ్లకు వివరణ ఇచ్చింది. తనకు తమిళ అడియన్స్ అంటే ఎంతో గౌరవమని.. అప్పట్లో పెట్టిన పోస్టుకు.. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. తమిళ ప్రజలను ఉద్దేశిస్తూ తాను ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ సుధీర్ఘ నోట్ షేర్ చేసింది ధన్య. రజినీకాంత్, విష్ణు విశాల్ నటిస్తోన్న లాల్ సలామ్ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.

ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే 2012లో తన ఫేస్ బుక్ లో ధన్య పెట్టిన ఓ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. అప్పట్లో ఆమె తమిళ ప్రేక్షకులను కించపరిచేలా పోస్ట్ పెట్టిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. దీంతో ఆ స్క్రీన్ షాట్స్ పై వివరణ ఇచ్చింది ధన్య. పన్నెండేళ్ల క్రితం ధన్య పెట్టిన పోస్టులో చెన్నై ప్రజలు బెంగుళూరు నుంచి నీరు, విద్యుత్ అడుక్కున్నారని.. చెన్నై ప్రజలు తమ నగరానికి వచ్చి అపరిశుభ్రంగా మారుస్తున్నారని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది.

Dhanya Balakrishna Movies

Dhanya Balakrishna Movies

“ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబందం లేదు. నా వృత్తి, తినే తిండి పై ప్రమాణం చేసి చెబుతున్నాను. అది నా అభిప్రాయం కాదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే చెప్పాను. కానీ ఇప్పుడు మళ్లీ ఆ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. కానీ ఆ పోస్ట్ నేను చేయలేదు. ఇన్నాళ్లుగా నా కుటుంబానికి నాకు చాలా బెదిరింపులు వచ్చాయి. నా కుటుంబాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను. ఆ కామెంట్స్ నేను చేయలేదు. నేను తమిళ్ ఇండస్ట్రీలోనే నటిగా కెరీర్ ప్రారంభించాను. ఇక్కడ నటిస్తుండడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. తమిళ్ ప్రేక్షకులే నాకు ఫస్ట్ అడియన్స్. నేను ఎవరిని హార్ట్ చేయలేదు. ఈ స్టేట్మెంట్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. తెలియకుండానే ఇందులో ఇరుక్కోవాల్సి వచ్చింది. అందుకు మీకు క్షమాపణలు చెబుతున్నాను” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.