
పైన ఫోటోలో కనిపిస్తోన్న ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తొలి సినిమాతోనే అడియన్స్ హృదయాలను దొచుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. కన్నడ సినీ పరిశ్రమలో మాత్రం ఎన్నో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ ఆషికా రంగనాథ్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆషికాకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ చిత్రం తర్వాత తెలుగులో మరో అవకాశం అందుకోలేకపోయింది ఆషిక. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.
ఆషికా రంగనాథ్ ఆగస్టు 5, 1996న కర్ణాటకలోని హాసన్‌లో జన్మించింది. తుమకూరులోని బిషప్ సర్గాంట్ పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత బెంగుళూరులోని జ్యోతి నివాస్ కళాశాల గ్రాడ్యూయేషన్ చేసింది. అయితే ఆషికా చదువుకుంటున్న సమయంలోనే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత కన్నడలో క్రేజీ భాయ్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ సినిమా తర్వాత కన్నడలో అనేక చిత్రాల్లో నటించింది. రాంబో 2 , మధగజ వంటి చిత్రాలలో నటించి అలరించింది. ఇక తెలుగులో అమిగోస్ సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది ఆషికా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.