
చెన్నైలో యాంటీ-నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ANIU) నిర్వహించిన మెరుపు దాడిలో మలయాళం-తమిళ సినిమాల నటి అంజు కృష్ణ అరెస్ట్ అయింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సౌత్ సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో తమిళ సినిమాదర్శకురాలు విన్సీ నివేత కూడా ఉంది. గురువారం (ఫిబ్రవరి 5) రాత్రి జరిగిన ఈ ఆపరేషన్ లో మొదట విగ్నేశ్వరన్ అనే వ్యక్తిని పట్టుకున్న పోలీసులు విచారణలో వెంకటేష్ కుమార్ (31) నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత డికాయ్ కస్టమర్‌ను పంపి వెంకటేష్ కుమార్‌ను వలసరావక్కంలోకి రప్పించారు. అతడి కారులో డ్రగ్స్ డెలివరీ జరుగుతుండగా పోలీసులు చుట్టుముట్టి అందరినీ అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ (30), విన్సీ నివేత (26), కార్తిక్ రాజా (31), యశ్వంత్ (25), శ్రీరామ్ (33), అల్విబిన్షా (27), వెంకటేష్ కుమార్ (31) ఉన్నారు. అందరినీ మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించి, జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెట్‌వర్క్ గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలుపుతున్నారు.
ఇక నటి అంజు కృష్ణ విషయానికొస్తే.. మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టింది. తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్‌లో నటించింది. మలయాళంలో ఆరో (జోజు జార్జ్‌తో), ఆకాశం కడన్న్ వంటి సినిమాల్లో నటించింది. తమిళంలో ఓం వెల్లిమలై సినిమాలో లీడ్ రోల్ చేసింది. టీవీలో ప్రియంకరి సీరియల్‌లో కనిపించింది. ఇక ఇప్పుడు అరెస్ట్ అయినా వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. విచారణ కొనసాగుతోంది, మరిన్ని వివరాలు బయటపడాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..