Renu Desai: రేణు లంచ్‌ చేస్తుంటే అకీరా, ఆద్యాల చిలిపి పనులు.. వైరల్‌గా మారిన లేటెస్ట్‌ పోస్ట్‌.

Renu Desai: రేణు దేశాయ్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడలింగ్‌ రంగంలో కెరీర్‌ మొదలు పెట్టిన రేణు..

Renu Desai: రేణు లంచ్‌ చేస్తుంటే అకీరా, ఆద్యాల చిలిపి పనులు.. వైరల్‌గా మారిన లేటెస్ట్‌ పోస్ట్‌.
Renu Desai

Updated on: Aug 31, 2021 | 11:20 AM

Renu Desai: రేణు దేశాయ్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడలింగ్‌ రంగంలో కెరీర్‌ మొదలు పెట్టిన రేణు.. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమానే వపన్‌, రేణుల మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన వీరు తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే కొన్నేళ్ల తర్వాత మనస్పార్థాల కారణంగా వీరిద్దరూ వీడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణు తమ కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్యాలతో జీవిస్తోంది. ఇక ఓ వైపు పిల్లల సంరక్షణ చూస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సినిమాను కొనగిస్తోంది రేణు.

రేణు దేశాయ్ ఇప్పటికే దర్శకురాలిగా మారి ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. ఇక కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారీ సూపర్‌ మామ్‌. తన చిన్నారులతో చేసిన సందడికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. రేణు పోస్ట్‌ చేసే ఫొటోలు, వాటికి ఇచ్చే క్యాప్షన్‌లు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఈ క్రమంలోనే రేణు తాజాగా కృష్ణాష్టమి పురస్కరించుకొని అకీరా నందన్‌, ఆద్యాల సందడికి సంబంధించిన ఫొటోను పోస్ట్‌ చేసింది. తలపై పూలతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసిన రేణు.. ‘నేను లంచ్‌ చేస్తున్న సమయంలో. అకీరా, ఆద్యాలు నా తలను పూలతో డెకరేషన్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు.

Also Read: Varudu Kaavalenu: టామ్‌ అండ్‌ జెర్రీలా ఉన్న వీరు ప్రేమలో ఎలా పడ్డారబ్బా.? ఆకట్టుకుంటోన్న వరుడు కావలెను టీజర్‌.

Preity Zinta: ప్రీతి జింటా జిమ్ వర్కౌట్స్ వీడియో.. మీ అందం వెనుక సీక్రెట్ తెలిసిపోయిందంటున్న ఫ్యాన్స్

Bheemla Nayak: సందడి మొదలైంది.. పవన్ బర్త్ ‏డే అదిరిపోయే సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన భీమ్లా నాయక్ టీం.. ట్వీట్ వైరల్..