Tollywood: హైదరాబాద్ నుమాయిష్‌లో షాపింగ్ చేసిన టాలీవుడ్ ప్రముఖ నటి.. ఎవరో గుర్తు పట్టారా?

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏటా నిర్వహించే నుమాయిష్‌కు మంచి క్రేజ్ ఉంది. నగరం నలుమూల నుంచి జనాలు ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు వస్తుంటారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ నుమాయిష్ కు వస్తుంటారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.

Tollywood: హైదరాబాద్ నుమాయిష్‌లో షాపింగ్ చేసిన టాలీవుడ్ ప్రముఖ నటి.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Jan 28, 2025 | 7:23 AM

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తోన్న నుమాయిష్ కు మంచి స్పందన వస్తోంది. జనవరి 03 నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు అంటే సుమారు 44 రోజుల పాటు జరగనుంది. ఈసారి ఏకంగ 2500 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో నుమాయిష్ ను తిలకించేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వేలాది సంఖ్యలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. నుమాయిష్ కు వచ్చే వారిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు.అలా తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నటి కమ్ స్టార్ యాంకర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో సందడి చేసింది. సామాన్యులతో కలిసి పోయి షాపింగ్ చేసింది. తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసింది. అలాగే టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ను రుచి చూసింది. అయతే ఎవరూ తనను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్, తలకు క్యాప్ ను ధరించింది అందల తార. దీంతో ఈ ముద్దుగుమ్మను అసలు గుర్తుపట్టలేకపోయారు. మరి ఈ అందాల యాంకరమ్మ ఎవరో మీరైనా గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు అనసూయ భరద్వాజ్.

సినిమాలు, టీవీ షోలతో బిజి బిజీగా ఉండే నటి అనసూయ తాజాగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వెళ్లింది. తన కుమారుడితో కలిసి ఎగ్జిబిషన్ లో సందడి చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తనకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసింది. అలాగే మిర్చీ బజ్జీ లాంటి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ను రుచి చూసింది. షూటింగ్, గ్రిప్ టెస్ట్ వంటి గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసింది. మొత్తానికి సామాన్యుల్లో కలిసి పోయి ఎగ్జిబిషన్ అంతా కలియ తిరిగింది అనసూయ. అనంతరం తన నుమాయిష్ విజిట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ నుమాయిష్ లో నటి అనసూయ..

సినిమాల విషయానికి వస్తే.. గతేడాది అనసూయ నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రజాకార్, పుష్ప 2 సినిమాల్లో అనసూయ కీలక పాత్రలు పోషించింది. ఇందులో పుష్ప 2 ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. ప్రస్తుతం ఈ అందాల తార చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.