దక్షిణాది చిత్రపరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అమలాపాల్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగులో చేసిన సినిమాలు సూపర్ హిట్ కాగా.. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో పూర్తిగా తమిళం, మలయాళం చిత్రాలకే పరిమితమైపోయింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైమ్ లోనే పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ఆ తర్వాత మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వగా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2023లో వీరి వివాహం కేరళలోని కొచ్చిలో జరిగింది. ఈ ఏడాది జూన్‌లో కొడుకు పుట్టాడు.
తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. సెప్టెంబరు 15 ఆదివారం ఓనం సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొడుకు, భర్త జగత్ దేశాయ్‌లతో దిగిన అద్భుతమైన ఫోటోలను ఇన్ స్టాలో పంచుకుంది. నదిలో పడవలో కొడుకు, భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. అమలాపాల్ కొడుకు క్యూట్ గా చూడముచ్చటగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
తమిళంలో వరుస సినిమాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన అమలాపాల్.. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన మూడేళ్లకే వీరిద్దరు విడిపోయారు. 2017 నుంచి ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. గతేడాది స్నేహితుడు జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకుంది. అమలాపాల్ కొడుకు పేరు ఇళయ్. అమల చివరిసారిగా పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ కాంబోలో వచ్చిన ఆడుజీవితంలో కనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.