AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: నెటిజన్ అసభ్యకరమైన ప్రశ్న.. చెప్పు చూపించిన అదాశర్మ.. వీడియో ఇదిగో

'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో భాగంగా నెటిజన్లతో ముచ్చటించింది అదాశర్మ. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ఆమెను అసభ్యకరమైన ప్రశ్నతో ఇబ్బంది పెట్టాలని చూశాడు. అయితే అదా శర్మ మాత్రం ఆ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి నోరు మూయించింది.

Adah Sharma: నెటిజన్ అసభ్యకరమైన ప్రశ్న.. చెప్పు చూపించిన అదాశర్మ.. వీడియో ఇదిగో
Adah Sharma
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 11:02 AM

Share

హీరోయిన్ అదాశర్మ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హార్ట్ ఎటాక్ సినిమాలో తన అందంతో ఇక్కడి కుర్రకారుకు నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించిందీ అందాల తార. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం తదితర సినిమాల్లోనూ హీరోయిన్ గా, సెకెండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిందీ అందాల తార. ఇక ది కేరళ స్టోరీ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోన్న అదా శర్మ సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులోనే షేర్ చేస్తుంటుంది. అలాగే సినిమా షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడల్లా నెటిజన్లతో ఛాటింగ్ సెషన్ లు కూడా నిర్వహిస్తుంటుంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిస్తుంటుంది. తాజాగా కూడా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్లతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ నిర్వహించింది అదా శర్మ.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ అదా శర్మను ‘మీ సైజు ఏమిటి?’ అని అసభ్యకరమైన ప్రశ్నతో ఇబ్బంది పెట్టాడు. ఇది దురుద్దేశంతో అడిగిన ప్రశ్న అని గ్రహించిన ముద్దుగుమ్మ వెంటనే .. ‘సైజు 9, నా చెప్పుల సైజు’ అని తన చెప్పులను చూపించింది. తద్వారా నెటిజన్ నోరు మూయించింది. సాధారణంగా, ఇబ్బందికరమైన లేదా అసభ్యకరమైన ప్రశ్న అడిగినప్పుడు, సెలబ్రిటీలు సమాధానం చెప్పడానికి సంకోచిస్తారు. లేదా అలాంటి ప్రశ్నలను దాటవేస్తారు. కానీ, అదా శర్మ అలా చేయలేదు. తనను ఇబ్బంది పెట్టాలన్న నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘సూపర్‌ వెల్లి’ అనే సినిమాలో నటిస్తోంది అదాశర్మ.రాజేశ్‌ బచ్చాని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ పోలీసు అధికారిగానూ, సూపర్‌ హీరోగానూ కనిపించనుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదాశర్మ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లు..

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us