అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌కు తొలి CEOగా జితేంద్ర మిశ్ర.. ఇంతకీ ఆయన ఎవరు?
Ram Mandir Trust CEO: అయోధ్య రామ మందిరం నిర్వహణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తొలి పూర్తికాల ప్రధాన కార్యనిర్వహణ అధికారి (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర నియమితులయ్యారు. ట్రస్ట్ సమావేశంలో ఆయన పేరుకు ఆమోదం లభించింది.

Ayodhya Ram Mandir Trust: అయోధ్య రామ మందిరం నిర్వహణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తొలి పూర్తికాల ప్రధాన కార్యనిర్వహణ అధికారి (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర నియమితులయ్యారు. ట్రస్ట్ సమావేశంలో ఆయన పేరుకు ఆమోదం లభించింది.
భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వహించిన జితేంద్ర మిశ్ర.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఆయనకు సైనిక పరిపాలన, నాయకత్వం, నిర్వహణలో విస్తృత అనుభవం ఉంది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల సేవ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.
జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ అధికారి. నివేదికల ప్రకారం, ఆపరేషన్ టైగర్ హిల్, ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి కీలక సైనిక కార్యకలాపాల్లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. తన సర్వీసు కాలంలో ఆయన 18కు పైగా రకాల యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను నడిపిన అనుభవం కలిగి ఉన్నారు.
ఐఏఎఫ్‌లో జితేంద్ర మిశ్రా నిర్వహించిన కీలక పదవులు
- ఫైటర్ స్క్వాడ్రన్ (మిగ్-21) కమాండింగ్ ఆఫీసర్
- చీఫ్ టెస్ట్ పైలట్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ASTE)
- చీఫ్ టెస్ట్ పైలట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), నాసిక్
- ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, 15 వింగ్ (బరేలీ), 18 వింగ్ (పఠాన్‌కోట్)
- డైరెక్టర్, ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ అసెస్‌మెంట్ బృందం
- డైరెక్టర్ జనరల్ (ఎయిర్‌క్రూ రిక్వైర్‌మెంట్స్)
- అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), ఎయిర్ హెడ్‌క్వార్టర్స్
- కమాండెంట్, ASTE
- డిప్యూటీ చీఫ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (డాక్ట్రిన్, ఆర్గనైజేషన్ అండ్ ట్రైనింగ్)
- డిప్యూటీ చీఫ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఆపరేషన్స్)
- ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ — జనవరి 1, 2025 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు
ఈ బాధ్యతలను పరిశీలిస్తే, విమానయానం, సైనిక కార్యకలాపాలు, ఆపరేషనల్ ప్లానింగ్, పరిపాలన, నాయకత్వం వంటి విభిన్న రంగాల్లో జితేంద్ర మిశ్రాకు విస్తృత అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, రామ మందిర ట్రస్ట్‌కు CEO నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 5,585 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి, చివరకు ముగ్గురు అభ్యర్థులతో కూడిన తుది ప్యానెల్‌ను ట్రస్ట్‌కు సమర్పించారు.
రామ మందిర నిర్మాణం, ఆలయ నిర్వహణ, భక్తుల దర్శన వ్యవస్థ, పరిపాలనా వ్యవహారాలు వంటి అంశాలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక CEO నియామకం ద్వారా ట్రస్ట్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
