Tollywood: అరె.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఏమైంది? ఫొటోస్ వైరల్.. షాకవుతోన్న ఫ్యాన్స్

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ హీరోయిన్ తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ముఖం నిండా గాయాలతో కనిపించిందీ అందాల తార. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywood: అరె.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఏమైంది?  ఫొటోస్ వైరల్.. షాకవుతోన్న ఫ్యాన్స్
Tollywood Actress

Updated on: May 05, 2025 | 4:45 PM

కొందరు సినిమాల కోసం ఎలాంటి కష్టాలు, ఇబ్బందులనైనా ఓర్చుకుంటారు. ఒంటికి దెబ్బలు తగిలినా సినిమా మాత్రం బాగా వస్తే చాలనుకుంటారు. అందుకోసం తమ శరీరాన్ని ఎంతైనా కష్టపెడతారు. టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. 2008లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. మొదటి హిందీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత
నితిన్ తో కలిసి ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి. అలా సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం , కల్కి తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సెకెండ్ ఫీమెల్ లీడ్ రోల్స్ పోషించిందీ ముద్దుగుమ్మ. అయితే 2023లో రిలీజైన లేడీ ఓరియంటెడ్ మూవీ ది కేరళ స్టోరీ అదా శర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. సినిమా కూడా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదా శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ముఖం గాయాలతో కనిపించి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసి ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే అవి ఇప్పటి ఫొటోలు కావు.. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ నాటి ఫొటోలు. ఈ మూవీ రిలీజై సోమవారం (మే05) నాటికి సరిగ్గా రెండేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో అప్పటి షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఈ ఫొటోలను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

 డీ హైడ్రేషన్ ఎఫెక్ట్ తో..

. ‘ మానవ మెదడు 75% నీటితో నిర్మితమైంది. డీ హైడ్రేషన్ దృష్టి, జ్ఞాపకశక్తి, మానసిక శక్తిని ప్రభావితం చేస్తుంది. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో జరిగింది. దీంతో డీ హైడ్రేషన్‌ కారణంగా నా పెదవులు మొత్తం పగిలిపోయాయి. నా మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలాయి. ది కేరళ స్టోరీ సినిమా కోసం నేను ఒక మంచి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ చాలా ఫోటోలు, వీడియోలు ఉన్నాయి, నాకు ఏమి పోస్ట్ చేయాలో తెలియడం లేదు. ఈ సినిమా నాకెన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. మీరు కూడా హైడ్రేటెడ్ గా ఉండండి, సురక్షితంగా ఉండండి’ అని రాసుకొచ్చింది అదాశర్మ.

అదా శర్మ లేటెస్ట్ ఫొటోస్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.