
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగి ఇప్పుడు క్యారెక్టరర్టిస్ట్ లుగా రాణిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో ఆమని ఒకరు. అప్పట్లో ఆమనీకి ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఎంటటైనర్ మూవీస్ లో ఆమని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు ఆమని. ఓ వైపు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు ఆమని. ఆమె నటించిన ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనే సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇటీవల ఆమని నారి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మార్చ్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమని పాల్గొన్నారు. అప్పుడు జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. యాంకర్ ఆడిన ప్రశ్నలు ఆమని ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. యాంకర్ స్త్రీల గురించి వాళ్లు పడే కష్టాలగురించి అడగ్గా ఆమని వాటికి సమాధానాలు ఇచ్చారు.. యాంకర్ ఆమనిని అడుగుతూ.. నవ మాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు ఉంటాయి అలాగే నెలసరి కూడా ఆడవాళ్లకే అని అడగ్గా.. ఆమని సంధానమిస్తూ.. కష్టాలన్నీ ఆడవాళ్లకేనండి. మగవాళ్లకు ఏముండదు.
మగాళ్లకు పెద్దగా కష్టాలు ఉండవు. ఆడవాళ్లేకే అన్ని కష్టాలు. పుట్టినప్పటి నుంచి ఓ వయసులు వచ్చే వరకు కష్టాలన్ని అమ్మాయిలకే ఉంటాయి. మగాడు 14 ఏళ్లకు అలాగే ఉంటాడు, 17కి అలాగే ఉంటాడు , 30 ఏళ్లు వచ్చినా కూడా అలాగే ఉంటాడు. కానీ ఆడాళ్ళు అలా కాదు ” అని ఆమని తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి.. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ లో బిజీగా ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.