Prabhas: ప్రభాస్ మకుటం లేని మహారాజు.. డార్లింగ్ పై సత్యానంద్ కుమారుడు ప్రశంసలు..

ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇటీవలే కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక డార్లింగ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన రాజాసాబ్ న్యూ పోస్టర్ అంచనాలు పెంచేసింది.

Prabhas: ప్రభాస్ మకుటం లేని మహారాజు.. డార్లింగ్ పై సత్యానంద్ కుమారుడు ప్రశంసలు..
Prabhas
Follow us

|

Updated on: Oct 26, 2024 | 10:04 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు చేతిలో అరడజనుకు పైగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న డార్లింగ్.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేందుకు ముందుంటారు. షూటింగ్స్ సెట్స్, అలాగే ఇంటికి వచ్చినవారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాడు. ప్రభాస్ ఇంటి భోజనం గురించి ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రెటీస్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు చలించిపోతాడు. తనకు హిట్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఇప్పటికీ ఏదోరకంగా సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. తాజాగా ప్రభాస్ మంచి మనసుపై సత్యానంద్ కుమారుడు వైవా రాఘవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్స్ గా వెలిగిపోతున్న ఎంతో మంది సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నవారే.

సత్యానంద్ ఎంతో మంది ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి నటీనటులను చేశారు. ఆయన ఇన్ స్టిట్యూట్ నుంచి వచ్చిన చాలా మంది వెండితెరపై స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అందులో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో. అయినా సింపుల్ గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు. ఇక సాయంలో కర్ణుడే. అయితే గతంలో తన గురువు సత్యానంద్ కు ప్రభాస్ ఓ రోలెక్స్ వాచ్ ఇచ్చాడట. దాని గురించి సత్యానంద్ తనయుడు.. నటుడు వైవా రాఘవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తన తండ్రికి ప్రభాస్ ఇచ్చిన రోలెక్స్ వాచ్ ఖరీదు రూ.35 లక్షలు అని.. ఇండియాలోనే లిమిటెడ్ ఎడిషన్ అని అన్నారు. ఆ వాచ్ ను తన తండ్రి జాగ్రత్తగా చూసుకుంటాడని.. ఎప్పుడైనా చూద్దాం అని అంటే కూడా ఇవ్వరని .. దూరం నుంచి చూపిస్తూ .. మళ్లీ బాక్సులోనే భద్రంగా దాచేస్తుంటారట. ఒక వేళ ఆ వాచ్ ను చేతికి పెట్టుకుంటే ఏవరైనా ఏమైనా చేస్తారా అని అడుగుతుంటారట.

అంతేకాకుండా ప్రభాస్ గతంలో తన జిమ్ ట్రైనర్ కు లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారట. ప్రభాస్ తనకు నచ్చిన వ్యక్తులకు ఎంతని చూడకుండా బహుమతులు ఇస్తుంటాడని అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఇటీవల డార్లింగ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.