‘ఫలక్‌నుమా దాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). మాస్ యాక్షన్ చిత్రాలతో వైవిద్యమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ స్పెషల్ ఇమెజ్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల పాగల్ సినిమాతో లవర్ బాయ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా విశ్వక్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam). ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. .
‘‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా చేస్తున్నాం. విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. తను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు ‘ఓ ఆడపిల్ల..’, ‘సిన్నవాడా…’ అనే లిరిక్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా హిలేరియస్‌గా ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ చిత్రానికి.. సూపర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్ చింతా చిత్రాన్ని తెరకెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పవి కె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
Bringing you, the Wholesome Entertainer for this Summer⛱️#AshokaVanamLoArjunaKalyanam
Releasing Worldwide on April 22nd ??#AVAKFromApril22nd@VishwakSenActor @RuksharDhillon @BvsnP @storytellerkola#BapineeduB @sudheer_ed @vidya7sagar @jaymkrish @SVCCDigital @SonyMusicSouth pic.twitter.com/nv4ajo3hXw— SVCC Digital (@SVCCDigital) March 15, 2022
Also Read: The Kashmir Files: సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా…?
Krithi Shetty: బంపరాఫర్ కొట్టేసిన కృతిశెట్టి.. ఏకంగా పాన్ ఇండియా స్టార్‌కు జోడిగా..?
Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే
RRR Movie: రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..