
సెన్సార్ బోర్డ్ సభ్యులపై విశాల్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల తాను నటించిన మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కోసం ముంబైలోని సెన్సార్ బోర్డ్ సభ్యులకు దాదాపు రూ.6.5 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చిందని చెబుతూ ఓ వీడియో షేర్ చేశాడు విశాల్. అంతేకాదు.. అమౌంట్ తీసుకున్న వ్యక్తుల పేర్లు, అకౌంట్స్ అన్నింటిని ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు. దీంతో విశాల్ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయంశంగా మారాయి. అయితే విశాల్ కామెంట్స్ పై కేంద్రం స్పందించిన సంగతి తెలిసిందే. సెన్సార్ కార్యలయంలో అవినీతి జరగినట్లు వస్తోన్న వార్తలు దురదృష్టకరమని.. దీనిపై విచారణ జరపనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
ఇక తాజాగా విశాల్ దేశ ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ బోర్డ్ ముంబయి కార్యాలయంలో జరిగిన అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానితోపాటు మహారాష్ట్ర సీఎంను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. “ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో జరిగిన అవినీతికి సంబంధించిన విషయంపై తక్షణ చర్యలు తీసుకున్నందుకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు తీసుకునే చర్యలు.. ఖచ్చితంగా అవినీతికి పాల్పడాలనుకునే ప్రభుత్వ అధికారుల్లో భయాన్ని నింపుతాయని.. అలాగే లంచాలు తీసుకోకుండా నిజాయితీగా వారు దేశానికి సేవలు చేసేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎంతోపాటు ఇతర అధికారులకు మరోసారి నా కృతజ్ఞతలు. మీరు చొరవ తీసుకోవడం వల్ల నాలాగా అవినీతి వల్ల ఇబ్బంది పడిన ప్రజలకు న్యాయం జరుగుతుందన్న తృప్తి కలుగుతుంది ” అంటూ ట్వీట్ చేశారు.
I sincerely thank @MIB_India for taking immediate steps on this important matter pertaining to corruption issue in #CBFC Mumbai. Thank you very much for the necessary action taken and definitely hoping for this to be an example for every government official who intends to or is…
— Vishal (@VishalKOfficial) September 30, 2023
అసలు విషయానికి వస్తే.. ఇటీవల విశాల్ ప్రధాన పాత్రలో మార్క్ ఆంటోనీ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 15న తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని అటు హిందీలోనూ రిలీజ్ చేయాలని భావించారు. అయితే హిందీ వెర్షన్ కోసం ముంబైలోని సెన్సార్ బోర్డ్ కార్యాలయానికి దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్సించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ విశాల్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి పరిస్థితిని తాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని.. దీంతో మరో దారిలేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని.. కానీ భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక విశాల్ చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న కేంద్రం విచారణ మొదలు పెట్టింది. అయితే సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పోస్టులపై పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్పందిస్తూ.. తమకు ఇప్పటివరకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని పేర్కొన్నాయి.
The issue of corruption in CBFC brought forth by actor @VishalKOfficial is extremely unfortunate.
The Government has zero tolerance for corruption and strictest action will be taken against anyone found involved. A senior officer from the Ministry of Information & Broadcasting…
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.