Actor Vishal: న్యూయార్క్‏లో అమ్మాయితో కనిపించిన విశాల్.. కెమెరా చూసి పరుగులు పెట్టిన హీరో.. అసలు విషయం ఇదే..

అమెరికాలోని న్యూయార్క్‏లో ఓ అమ్మాయితో విశాల్ కలిసి నడుస్తూ వెళ్తుండగా.. ఎవరో వీడియో తీశారు. వీడియో తీయడం చూసిన విశాల్ తన హూడీతో ముఖాన్ని కప్పేసుకుని పరిగెత్తారు. ఈ వీడియోను ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్‏లో పోస్ట్ చేస్తూ.. న్యూయార్క్ సిటీలో ఎవరో వ్యక్తితో నటుడు విశాల్ నడుచుకుంటూ వెళ్తున్నారా అంటూ పోస్ట్ చేశారు. 10 సెకన్స్ నిడివి ఉన్న ఈ వీడియో క్షణాల్లో వైరలయ్యింది. విశాల్‏తో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు ?.

Actor Vishal: న్యూయార్క్‏లో అమ్మాయితో కనిపించిన విశాల్.. కెమెరా చూసి పరుగులు పెట్టిన హీరో.. అసలు విషయం ఇదే..
Vishal

Updated on: Dec 28, 2023 | 7:01 AM

కోలీవుడ్ హీరో విశాల్ వ్యక్తిగత జీవితం గురించి నిత్యం అనేక వార్తలు వైరలవుతుంటాయి. ఎప్పుడూ ఈ హీరో పెళ్లిపై అనేక రూమర్స్ వినిపిస్తుంటాయి. కానీ నిన్నటి నుంచి విశాల్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అమెరికాలోని న్యూయార్క్‏లో ఓ అమ్మాయితో విశాల్ కలిసి నడుస్తూ వెళ్తుండగా.. ఎవరో వీడియో తీశారు. వీడియో తీయడం చూసిన విశాల్ తన హూడీతో ముఖాన్ని కప్పేసుకుని పరిగెత్తారు. ఈ వీడియోను ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్‏లో పోస్ట్ చేస్తూ.. న్యూయార్క్ సిటీలో ఎవరో వ్యక్తితో నటుడు విశాల్ నడుచుకుంటూ వెళ్తున్నారా అంటూ పోస్ట్ చేశారు. 10 సెకన్స్ నిడివి ఉన్న ఈ వీడియో క్షణాల్లో వైరలయ్యింది. విశాల్‏తో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు ?.. కావాలని వీడియో చేశారా ?.. అనే సందేహాలను వ్యక్తం చేశారు. మరోవైపు విశాల్ గురించి కాస్త నెగిటివ్ ప్రచారం నడిచింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చారు హీరో విశాల్.

“క్షమించండి అబ్బాయిలు.. తాజా వీడియో గురించి నిజాన్ని వెల్లడించే సమయం వచ్చింది. అవును నేను న్యూయార్క్‌లో ఉన్నాను. ప్రతి సంవత్సరం చివర్లో మనశ్శాంతి కోసం బంధువులతో కలసి ఇక్కడికి వచ్చేవాడిని. నేను దీన్ని ఒక ఆచారంగా పాటిస్తున్నాను. ప్రస్తుతం కనిపిస్తున్న వీడియోను క్రిస్మస్ రోజున నన్ను ఆట పట్టించాలని నా కజిన్స్ రూపొందించిన వీడియో అది. నాలో ఎప్పటినుంచో ఉన్న చిన్న పిల్లాడిని బయటకు తీసుకురావడం మంచి అనుభూతినిస్తుంది. అందుకే చేశాను. అలాగే మీ ఊహగానాలన్నింటికీ ముగింపు పలుకుతున్నాను. ఈ వీడియోతో నన్ను కొందరు టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ వాటిని పట్టించుకోను. లవ్ యూ ఆల్” అంటూ రాసుకొచ్చారు విశాల్.

ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రత్నం, డిటెక్టివ్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. రత్నం సినిమాను హరి డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో పూజ, పొగరు రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మూడోసారి రత్నం డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు విశాల్. అలాగే డిటెక్టివ్ 2 సినిమాను విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. 2017లో విడుదలైన డిటెక్టివ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అప్పుడు మిస్కిన్ దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో ఈ సినిమా దర్శఖత్వం బాధ్యతలు విశాల్ చూసుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.