AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vishal: ఆ విషయం చెప్పడానికి మీరెవరు..? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తమిళ్ ఇండస్ట్రీలోని ఓ బడా నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విశాల్ చేసిన కామెంట్స్ తమిళ్ ఫిల్మ్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు విషయానికి వస్తే.. రత్నం సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో విశాల్ మాట్లాడుతూ కోలీవుడ్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పై సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తాను నటించిన మార్క్ ఆంటోని మూవీ విడుదలను రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాణ సంస్థ ఆలస్యం

Actor Vishal: ఆ విషయం చెప్పడానికి మీరెవరు..? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్..
Vishal
Rajitha Chanti
|

Updated on: Apr 16, 2024 | 3:12 PM

Share

కోలీవుడ్ హీరో విశాల్ నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తుంటాడు. ఇన్నాళ్లు రత్నం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈమూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తమిళ్ ఇండస్ట్రీలోని ఓ బడా నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విశాల్ చేసిన కామెంట్స్ తమిళ్ ఫిల్మ్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు విషయానికి వస్తే.. రత్నం సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో విశాల్ మాట్లాడుతూ కోలీవుడ్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పై సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తాను నటించిన మార్క్ ఆంటోని మూవీ విడుదలను రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాణ సంస్థ ఆలస్యం చేసిందని.. కానీ ఆ మూవీ ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలైందని అన్నారు.

“సినిమాను ఆపేద్దాం.. లేదా తర్వాత విడుదల చేద్ధాం అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. తమిళ సినిమా నా చేతుల్లోనే ఉందని చెప్పుకునే వారికి విజయం సాధించినట్లు చరిత్రే లేదు. ఈ విషయం నేను నా కోసం చెప్పడం లేదు. నాలాంటి వాళ్లు డబ్బులు ధారపోసి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. చెమటొడ్చి సినిమా తీస్తుంటే.. కొందరు నిర్మాతలు మాత్రం ఏసీ రూంల్లో కూర్చొని ఆ సినిమా రిలీజ్ చేయకండి.. వాయిదా వేయండి అంటూ ఆదేశాలు ఇస్తున్నారు. రూ.65 కోట్లు పెట్టి మార్క్ ఆంటోని సినిమాను నిర్మించి వినాయక చవితికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ తేదీకి వారం రోజుల ముందు కాల్ చేసి థియేటర్స్ ఇవ్వలేమని చెప్పారు. రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత తన సినిమా విడుదల తేదీని నిర్ణయించకూడదా ?.. అసలు మీరెవరు ఈ సినిమా విడుదల చేయొద్దు అని చెప్పడానికి. మార్క్ ఆంటోని సినిమాకు ఎన్నో అడ్డంకులు పెట్టాలనుకున్నారు.. కానీ సినిమా మాకు లాభాలే తీసుకవచ్చింది.” అని అన్నారు.

రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరకీ లేదని.. అందుకే నిర్మాతలు ధైర్యంగా ఉండాలని.. నిర్మాతలు బాగుంటేనే తనలాంటి వాళ్లు సినిమా తీయ్యోచ్చు అని అన్నారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాణ సంస్థ కోలీవుడ్ హీరో సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సొంత నిర్మాణ సంస్థ. దీంతో ఆ సంస్థకు ఎదురు ఎవరూ మాట్లాడేవారు కాదని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
కిలో వెండి ధర రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? భారీగా తగ్గనున్న బంగారం
కిలో వెండి ధర రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? భారీగా తగ్గనున్న బంగారం
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు... నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు... నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?
మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా? నిమిషాల్లో కనిపెట్టేయండిలా!
మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా? నిమిషాల్లో కనిపెట్టేయండిలా!
షూటింగ్ స్పాట్‌లో తారక్ చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ ఫిదా
షూటింగ్ స్పాట్‌లో తారక్ చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ ఫిదా
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం