
విజయ లక్ష్మీ..! ఒకప్పుడు ఫేమస్ యాక్టరస్.. తన అందంతో.. అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న నటి ఆమె. తమిళ్‌తో పాటు.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ అందాల భామ. సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా చేస్తూ.. ఇప్పటికీ అందర్నీ అలరిస్తుంది. అలాంటి ఈ స్టార్ .. తాను మోసపోయానంటూ రోడ్డుకెక్కారు. నటుడు, దర్శకుడు, రాజకీయనాయకుడు అయిన ఓ ప్రబుద్ధుడు తనను లైగింకంగా వాడుకున్నారంటూ.. ఏకంగా ఏడు సార్లు తనకు అబార్షన్ చేయించాడంటూ.. ఆరోపిస్తూ.. సూసైడ్ అటెంప్ట్ చేసి వార్తల్లో నిలిచింది. తన కామెంట్స్ తో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారారు. ఇక అసలు విషయం ఏంటంటే..!
నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత, నటుడు, దర్శకుడు అయిన సీమాన్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేస్తూ.. మరో సారి మీడియా ముందుకు వచ్చారు నటి విజయలక్ష్మీ. గతంలో ఆయనపైనే చేసిన ఆరోపణలకు తోడుగా.. ఈ సారి మరింత పదునుగా.. సీమాన్ పై విరుచుకుపడ్డారు. తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన విజయలక్ష్మి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న బాధలను గురించి ఆవేదన వ్యక్తం చేసింది. “నాకు నరకం అంటే ఏమిటో చూపించారు” అంటూ ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ఏడు సార్లు గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు విజయలక్ష్మీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.