AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్కూల్ ఏజ్‌లోనే కూలి పని.. ఆపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వర్కర్.. ఇప్పుడేమో టాలీవుడ్ స్టార్ హీరో

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో ఇతను కూడా ఒకరు. ఇప్పుడీ హీరోకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు, క్రేజ్ ఉంది. అయితే ఈ స్థాయి దాకా రావడానికి అతను చాలా కష్ట పడ్డాడు.

Tollywood: స్కూల్ ఏజ్‌లోనే కూలి పని.. ఆపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వర్కర్.. ఇప్పుడేమో టాలీవుడ్ స్టార్ హీరో
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 2:46 PM

Share

సైడ్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అందులోనే తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.. కానీ యాక్టర్ అంటే అన్ని పాత్రలు చేయాలిగా.. అందుకే విలన్ గానూ అదరగొట్టాడు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అతను మరెవరో కాదు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి. టాలీవుడ్ ,కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోన్న ఈ వర్సటైల్ యాక్టర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే తన బాల్యం, టీనేజ్ లో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

‘చిన్నప్పడు మేం చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా నాన్న మా భవిష్యత్ కోసం చాలా అప్పులు చేశాడు. అవి కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఒక్కోసారి అప్పులు కట్టలేదని మా ఇంటిపైకి దాడికి కూడా వచ్చేవాళ్లు. ఆ సమయంలో మా నాన్న ఒంటరిగా ఉండకూదని ఎప్పుడూ నేను ఆయన పక్కనే కూర్చునేవాడిని. మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు బుల్లెట్‌ బండిపై ఇంటికి వస్తూ.. ఫ్రైడ్‌ రైస్‌ వెంట తీసుకొచ్చేవాడు. మాతో కలిసి తినేవాడు. అది నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం.

ఇవి కూడా చదవండి

‘ నేను అసలు యాక్టర్ అవ్వాలనుకోలేదు. కేవలం డబ్బు కోసమే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరాల కోసమే కెమెరా ముందుకు వచ్చాను. మొదట్లో సినిమాల్లో నటించడం అసలు నచ్చేది కాదు. కానీ కష్టపడి పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఏ పని అయినా సరే గౌరవంగా చేయడం నాకు అలవాటు. అందుకే సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పని చేశాను. స్కూల్‌ ఏజ్‌లో కూలీ పనికి వెళ్లాను. రిటైల్ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా చేశాను. ఫాస్ట్ ఫుడ్ జాయింట్‌లో క్యాషియర్‌గా, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా… ఇలా చాలా పనులు ఇష్టంతోనే చేశాను’ అని చెప్పుకొచ్చాడు మక్కల్ సెల్వన్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్లమ్ డాగ్ లో హీరోగా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి.

ది ట్రైన్ సినిమాలో విజయ్ సేతుపతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
వివో టీ5 5జీ స్మార్ట్​ఫోన్.. స్పెషాలిటీస్​ ధర తెలుసా
వివో టీ5 5జీ స్మార్ట్​ఫోన్.. స్పెషాలిటీస్​ ధర తెలుసా
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా
నేపాల్‌ వరదలు.. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ గల్లంతు!
నేపాల్‌ వరదలు.. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ గల్లంతు!