Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇన్ స్టాలో ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా..? లైఫ్ స్టైల్ చూస్తే..

విజయ్ దేవరకొండ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, గీతా గోవిందం వంటి హిట్ చిత్రాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు కింగ్డమ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. తాజాగా విజయ్ ఆస్తుల వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇన్ స్టాలో ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా..? లైఫ్ స్టైల్ చూస్తే..
Vijay Deverakonda

Updated on: May 10, 2025 | 10:09 AM

సినీరంగంలో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 2016లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యధిక డిమాండ్ ఉన్న హీరోగా మారారు. అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, ఖుషి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్.. ఇప్పుడు కింగ్ డమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటివరకు విడుదలైన ఈ మూవీ సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. మరోవైపు విజయ్ సంపాదన, ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మే 9న విజయ్ దేవరకొండ 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విజయ్ కు అభిమానులు, సినీతారలు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే 2025లో విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నివేదికల ప్రకారం విజయ్ దేవరకొండ ఆస్తులు రూ.70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే ఒక్కో సినిమాకు రూ.15 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం తెలుగు సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా మారారు. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 1 కోటి కంటే ఎక్కువగా తీసుకుంటున్నారట. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్ చేసిన పోస్ట్‌కు దాదాపు రూ. 40 లక్షల కంటే ఎక్కువ వసూలు చేస్తారని టాక్. విజయ్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉంటున్నారు.

విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్స్..

  • లెక్సస్ MPV
  • BMW 5 సిరీస్ 520d లగ్జరీ లైన్
  • మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ 350
  • వోల్వో XC90
  • ఆడి క్యూ7

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్.