Vijay Devarakonda: నా కెరీర్‏లోనే అత్యంత పెద్ద సినిమా ఇదే.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని పూర్తిచేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న

Vijay Devarakonda: నా కెరీర్‏లోనే అత్యంత పెద్ద సినిమా ఇదే.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..
Vijay Devarakonda

Updated on: May 13, 2022 | 10:08 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇటీవలే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని పూర్తిచేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతోపాటు.. విజయ్.. ఇప్పుడు మరోసారి పూరి దర్శకత్వంలో జనగనమణ సినిమా చేస్తున్నాడు.. అలాగే డైరెక్టర్ శివనిర్వాణతో కలిసి ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‏గా నటిస్తుండగా.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఓవైపు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నాడు రౌడీ హీరో. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు విజయ్.

అందులో ఓ బోట్‏లో నిల్చున్న విజయ్ నీటివైపు చూస్తూ.. మేఘావృతమైన ఆకాశం.. అందమైన నది మధ్యలో పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. తన కెరీర్‏లోనే లైగర్ అత్యంత పెద్ద సినిమా లైగర్ అని.. అలాగే అందమైన సరదా ప్రేమకథా చిత్రమ్ VD11 అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.. లైగర్ చిత్రాన్ని దర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ లైగర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.. అలాగే ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: 9 Hours Web Series: డిస్నీ ఫ్లస్ హాట్‏స్టార్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 9 అవర్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం

Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..