Venkatesh: అలాంటివి చేయాలంటే చిన్న ఇబ్బంది ఉంది.. ఆసక్తిక విషయాలు చెప్పిన వెంకిమామ..

|

May 25, 2022 | 9:09 PM

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Venkatesh: అలాంటివి చేయాలంటే చిన్న ఇబ్బంది ఉంది.. ఆసక్తిక విషయాలు చెప్పిన వెంకిమామ..
Venkatesh
Follow us on

విక్టరీ వెంకటేష్ (Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా ఎఫ్ 3. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీగా వస్తున్న ఎఫ్ 3 ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో హీరో విక్టరీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు.

వెంకటేష్ మాట్లాడుతూ.. “నేను నిర్మాత పక్షాన ఆలోచిస్తా. సెట్ కి వెళ్ళిన తర్వాత ఏది వృధా జరుగుతున్నా ఒప్పుకోను. ఇక ఫిలిం మేకింగ్ ప్లానింగ్ కి ఒక ఫార్ములా అనేది వుండదు. అంతిమంగా రిజల్ట్ బావుంటే.. మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం. పాన్ ఇండియా గురించి పెద్దగా అలోచించలేదు. ఐతే సరైన టీం కుదిరితే తప్పకుండా చేస్తాను.. ఇది వరకే చాలా మంది రియాల్టీ షో చేయమని నన్ను సంప్రదించారు. ఐతే రియాలిటీ షో చేయడంలో నాకు చిన్న ఇబ్బంది వుంది. చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వమంటే రెండు మూడుసార్లు తర్వాత నాకు ఎదో తెలియని బ్లాక్ వచ్చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు..

ఇవి కూడా చదవండి

అలాగే తన తండ్రి రామానాయుడు బయోపిక్ లో నటిస్తారా అని అడగ్గా.. చేస్తే బాగానే వుంటుంది. ఐతే స్క్రిప్ట్ కుదరాలి కదా.. వివేకానంద కథ అనుకున్నాను. అది కుదరలేదన్నారు వెంకీ.. నేను ఒకరితో పోల్చుకొను. నాకు ఉన్నదే బోనస్ అనుకుంటా. ఇంకేది ఎక్కువగా అడగను. ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తా. సినిమాల్లోనే కాదు ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు ప్రత్యేకం. ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు.. నా కొడుకు ప్రస్తుతం చదువుకుంటున్నాడు..ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు అని తెలిపారు..