Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh) . ఈ సినిమా తర్వాత వరుణ్ నటించిన సినిమాలు ఆశించిన

Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..
Varun

Updated on: Mar 12, 2022 | 9:22 PM

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh) . ఈ సినిమా తర్వాత వరుణ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాయి. ఇటీవల ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆశించినంతగా ఆకట్టుకోలేదు. తాజాగా వరుణ్ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. యంగ్ హీరో సందీప్ కిషన్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ మైఖేల్. ఈ చిత్రం గురించి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది గురించి నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ చిత్రంపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వారంతా ఈ సినిమాలో ప‌నిచేయ‌డం పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

హ్యాండ్సమ్, టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే పాత్ర‌ను పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా ప్ర‌తిభ‌గ‌ల న‌టీమ‌ణుల్లో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం విశేషం. ఇప్పుడు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన తర్వాత వరుణ్ సందేశ్ అంగీక‌రించిన మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది.

మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మైఖేల్ చిత్రం భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.

Also Read: Naveen Polishetty: బ్యాక్ గ్రౌండ్ లేదు ఇండస్ట్రీలో కష్టమన్నారు.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్ వైరల్..

Sebastian pc 524: ఆహాలో సందడి చేయనున్న కిరణ్ అబ్బవరం.. సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‏తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..

Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‏గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..