ఎంసెట్ టాపర్‌ను సుభాష్ చంద్రబోస్ ఎవరని అడిగా.. అతడు చెప్పిన ఆన్సర్ ఇది.. టాలీవుడ్ నటుడు..
ఒకప్పుడు జాయింట్ కలెక్టర్.. ఉన్నత చదువులు చదివి ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ క్రాక్ చేశారు. కానీ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన మరెవరో కాదు.. సీనియర్ నటుడు వడ్లమాని శ్రీనివాస్. తాజాగా మహేంద్రగిరి వారాహి చిత్రంలోని వాట్ ఏ లాజిక్ సర్ జీ పాట విడుదల కార్యక్రమంలో వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడారు. చదువుతో పాటు సినిమాలు చూడాలని, సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు.

సినీరంగంలోకి నటనపై ఆసక్తితో ఉన్నత ఉద్యోగాలు వదిలి కెమెరా ముందుకు వచ్చిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్.. కానీ ఇప్పుడు నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు వడ్లమాని శ్రీనివాస్. తెలుగులో అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి.. విలక్షణ నటనతో, సహజమైన హావభాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా మహేంద్రగిరి వారాహి చిత్రంలోని వాట్ ఏ లాజిక్ సర్ జీ పాట విడుదల కార్యక్రమంలో సినీ నటుడు వడ్లమాని శ్రీనివాస్ ప్రసంగించారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా, సినిమాలు చూస్తూ, జీవితాన్ని ఆనందిస్తూ సమగ్రంగా అభివృద్ధి చెందాలని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్‌లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. ఇంజనీరింగ్‌లో ఒకటో ర్యాంక్ సాధించిన ఒక విద్యార్థికి సుభాష్ చంద్రబోస్ ఎవరని అడిగితే, బస్ ట్రావెల్స్ యజమాని అని సమాధానం ఇచ్చాడని ఆయన తెలిపారు. తాను ఉన్నత చదువులు చదివి, కలెక్టర్ స్థాయికి వచ్చి, చివరకు సినిమా నటుడిగా మారానని, తండ్రి పాత్రలు పోషిస్తున్నానని చెబుతూ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుందని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో
కాబట్టి విద్యతో పాటు వినోదం, సాధారణ జ్ఞానం కూడా ముఖ్యమని శ్రీనివాస్ అన్నారు. సుమంత్, సంతోష్ జాగర్లపూడి ముఖ్య పాత్రలు పోషించిన మహేంద్రగిరి వారాహి చిత్రం అద్భుతమైన సినిమా అని, అందరూ తప్పకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అని, ఆయన్ను కేవలం ఒక ప్రయాణ సంస్థ యజమానిగా చూడకూడదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. మహేంద్రగిరి వారాహి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారు. ఇందులో హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..
వడ్లమాని శ్రీనివాస్ స్పీచ్..
Shocking Comments on GenZ Kids 😱
Ee Generation Kids ki Ranks thappa General Knowledge pina Grip ledu.
ఒక EAMCET Toper ని #Subashchandrabose ఎవరు? అని అడిగితే.. “#Vijaywada లో #BoseTravels అని చుపించాడు
:- Actor #VadlamaniSrinivas#MahendragiriVarahi pic.twitter.com/Qj6Bw8gmOz
— Milagro Movies (@MilagroMovies) August 22, 2026
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..
