Nayanthara: నయనతార లేకపోతే ఈ రోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు.. ఎమోషనల్ అయిన నటుడు

|

Dec 02, 2024 | 12:02 PM

హీరో,నిర్మాత ధనుష్ నిర్మించిన 'నానుమ్ రౌడీ థాన్' చిత్రం నుంచి కొన్ని సీన్స్ డాక్యుమెంటరీలో వాడుకున్నారని ఎన్ఓసీ జారీ చేయకపోవడంతో వివాదం మొదలైంది. దీని తరువాత, నయనతార ధనుష్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో బహిరంగ లేఖను విడుదల చేసింది.

Nayanthara: నయనతార లేకపోతే ఈ రోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు.. ఎమోషనల్ అయిన నటుడు
Nayanthara
Follow us on

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ వివాహ డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వడానికి ముందే వివాదాలను సృష్టించింది. హీరో,నిర్మాత ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ థాన్’ చిత్రం నుంచి కొన్ని సీన్స్ డాక్యుమెంటరీలో వాడుకున్నారని ఎన్ఓసీ జారీ చేయకపోవడంతో వివాదం మొదలైంది. దీని తరువాత, నయనతార ధనుష్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో బహిరంగ లేఖను విడుదల చేసింది. దాంతో ఇది ఇంకాస్త మంటలు రేపింది. దీంతో ధనుష్ నయనతార, విఘ్నేష్ శివన్ సంస్థ రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కూడా కేసు పెట్టాడు. ఈ ఘటనలో నయనతారకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

ఇదిలా ఉంటే ధనుష్ విడాకుల వార్త తర్వాత నయనతార చేసిన ఓ వ్యాఖ్య కూడా వివాదాస్పదమైంది. ధనుష్ పేరు చెప్పనప్పటికీ, నటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ ధనుష్ ను ఉద్దేశించే చేసిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. “మీరు ఒక అబద్ధంతో ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు, మీరు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇదే కర్మ” అని నటి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో నయనతార గురించి నటుడు తంబి రామయ్య చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో, తంబిరామయ్య తన తల్లి చనిపోయినప్పుడు నయనతార చేసిన కాల్ గురించి మాట్లాడారు. తన తల్లి చనిపోవడంతో తాను చాలా ఒంటరివాడయ్యానని, ఆత్మహత్య గురించి కూడా ఆలోచించానని చెప్పాడు. అయితే ఈరోజు నేను బతికే ఉన్నానంటే దానికి కారణం నయనతార అని తంబి రామయ్య అన్నారు. తంబి రామయ్య మాట్లాడుతూ.. “మా తల్లి చనిపోయినప్పుడు నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. అమ్మ నాకు సర్వస్వం. తల్లి మరణం తర్వాత తీవ్ర మనోవేదనకు గురయ్యాను. అప్పటికి కేవలం నా కుమార్తె వివాహం మాత్రమే జరిగింది. కొడుకు పెళ్లి కాలేదు. ఆ సమయంలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాను. అప్పట్లో నాలుగు సినిమాలు చేస్తున్నా.. ఆ సమయంలో నయనతారతో డోర అనే సినిమా చేస్తున్నా.. అప్పుడే నయనతార నాకు ఫోన్ చేసి మాట్లాడింది. ఆ రోజు నాకు చాలా నిజాలు అర్థమయ్యేలా చేసింది. ఆ తర్వాత ఆత్మహత్య ఆలోచనలు మాయమయ్యాయి. నయనతార సమయానికి నాకు ఫోన్ చేయకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో నేను కూడా ఊహించలేను. అప్పుడే తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే కొడుకు పెళ్లి నేను చూసేవాడిని కాదు. ఈ ప్రపంచంలో పరిష్కరించలేని సమస్య లేదు. సంక్షోభాలు వచ్చినప్పుడు మనకంటే దిగువన ఉన్నవారి సమస్యల గురించి ఆలోచిస్తే మనది సమస్య కాదని అర్థమవుతుందని తంబిరామయ్య అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..