Hanuman: ‘హనుమాన్‌’ కోసం చాలా త్యాగాలు చేశా.. 70-75 సినిమాలను తిరస్కరించాను: హీరో తేజ సజ్జా

' హనుమాన్ ' సినిమా కోసం చాలా త్యాగాలు చేశాడట తేజ సజ్జా . చాలా సినిమాల అవకాశాలను వదులుకున్నాడు. ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమాన్‌ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడీ యంగ్ హీరో

Hanuman: హనుమాన్‌ కోసం చాలా త్యాగాలు చేశా.. 70-75 సినిమాలను తిరస్కరించాను: హీరో తేజ సజ్జా
Hanuman Movie

Edited By:

Updated on: Feb 05, 2024 | 9:41 PM

యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్‌ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. దేశీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ నటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అయితే ‘ హనుమాన్ ‘ సినిమా కోసం చాలా త్యాగాలు చేశాడట తేజ సజ్జా . చాలా సినిమాల అవకాశాలను వదులుకున్నాడు. ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమాన్‌ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడీ యంగ్ హీరో. ”హనుమాన్’ సినిమా పనులు పూర్తి చేయడానికి రెండున్నరేళ్లు పట్టింది. ఈ సమయంలో వేరే సినిమాల గురించి అసలు దృష్టి పెట్టలేదు. నాకు ఇతర అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో నేను దాదాపు 70 నుండి 75 ప్రాజెక్ట్‌లను తిరస్కరించాను. అందులో కనీసం 15 ప్రాజెక్టులు బాగున్నాయి. అయితే హనుమాన్ సినిమాకు పూర్తిగా కమిట్ అయ్యాను’ అని తేజ సజ్జా తెలిపాడు.

ఓ మోస్తరు బడ్జెట్‌తో రూపొందిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది. ఈ సినిమా చేయడానికి తాను చాలా కష్టపడ్డానని తేజ సజ్జ ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. ‘ఈ సినిమాలో సూపర్ హీరో లుక్ కోసం 25 లుక్ టెస్టులు చేశాం. సాధారణంగా, ఇతర నటీనటులు రెండు-మూడు లుక్ పరీక్షలు చేస్తారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చాలా కష్టమైంది. అలాంటి అన్ని సన్నివేశాల్లో నేనే నటించాను’ అన్నారు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ చిత్రం జనవరి 12న విడుదలైంది. అమృత అయ్యర్, రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించారు. సంక్రాంతి సందర్భంగా తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలకు ‘హనుమాన్’ గట్టి పోటీనిచ్చింది. ఈ సినిమా విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీక్వెల్‌కి ‘జై హనుమాన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల దీని స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ‘హనుమాన్’ సినిమా విజయం సాధించడంతో తేజ సజ్జ డిమాండ్ పెరిగింది.

ఇవి కూడా చదవండి

అమెరికాలో హనుమాన్ టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us