Megastar Chiranjeevi: చిరంజీవి ఎత్తుకున్న ఆ చిన్నోడు ఇప్పుడు హీరో.. 25 ఏళ్ళ అనుభవమంటూ ఎమోషనల్ పోస్ట్..

|

Aug 28, 2023 | 8:16 AM

కేవలం మూడేళ్ల వయసులోనే చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసి..ఏకంగా చిరు ఎత్తుకుని అభిమానులకు పరిచయం చేశాడు. ఇప్పుడు అదే ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ చిన్నోడిని గుర్తుపట్టారా ?.. అతనే టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ. కేవలం మూడేళ్ళ వయసులోనే సినీ ప్రయాణం మొదలు పెట్టి చిరు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్నారు.

Megastar Chiranjeevi: చిరంజీవి ఎత్తుకున్న ఆ చిన్నోడు ఇప్పుడు హీరో.. 25 ఏళ్ళ అనుభవమంటూ ఎమోషనల్ పోస్ట్..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రజానీకానికి ఉన్న అభిమానం గురించి చెప్పక్కర్లేదు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఎందరో. ఇక చిరుతో ఒక్క సినిమా అయినా చేయాలని డైరెక్టర్ట్స్.. ఆయన చిత్రంలో చిన్న పాత్ర వచ్చినా చాలు అనుకునే నటీనటులు చాలా మంది ఉంటారు. కానీ యంగ్ హీరో మాత్రం చిన్నప్పుడే చిరంజీవి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం మూడేళ్ల వయసులోనే చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసి..ఏకంగా చిరు ఎత్తుకుని అభిమానులకు పరిచయం చేశాడు. ఇప్పుడు అదే ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ చిన్నోడిని గుర్తుపట్టారా ?.. అతనే టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.

కేవలం మూడేళ్ళ వయసులోనే సినీ ప్రయాణం మొదలు పెట్టి చిరు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్నారు తేజ. ఆగస్ట్ 27తో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా తన మొదటి సినిమా సందర్భంలో తీసిన ఫోటోలను షేర్ చేసి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా చూడాలని ఉంది. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమాతోనే బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు తేజ సజ్జా.ఈ సినిమా ఫంక్షన్ టైంలో చిరంజీవి తనను ఎత్తుకుని అభిమానులను చూపిస్తోన్న ఫోటోను షేర్ చేస్తూ.. “25 ఏళ్ల క్రితం నేను ఎలాంటి ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అనే విషయం నాకు ఏమాత్రం తెలియదు. కానీ అదే పరిశ్రమ ఇప్పుడు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక లెజెండ్ పక్కన కనిపిస్తూ పరిచయమైన నేను ఇప్పుడు హనుమాన్ వరకు చేరుకున్నాను.. ఇప్పటికీ ఇదంతా నాకు ఒక కలలా ఉంది. చిరంజీవి గారూ, గుణశేఖర్ గారు, అశ్వినీదత్ గారు నా కలను నిజం చేశారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను” అంటూ రాసుకొచ్చారు తేజ సజ్జా. చివరగా నాకు ప్రస్తుతం 28 ఏళ్లు.. కానీ అనుభవం 25 ఏళ్లు అంటూ ముగించారు.

ప్రస్తుతం తేజ సజ్జా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. అతడికి ఫ్యాన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. సమంత నటించిన ఓ బేబీ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు తేజ సజ్జ. ఆ తర్వాత జాంబీరెడ్డి సినిమాతో హిట్ అందుకున్న తేజ.. ఇప్పుడు హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.