Suriya: నడవడానికి ఇబ్బంది పడుతున్న సూర్య.. ప్రమాదం తర్వాత ఎలా ఉన్నాడో చూశారా ?.. ఫ్యాన్స్ పూజలు..

ఇటీవల కమల్ నటించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ పాత్రలో అదరగొట్టారు. రోలెక్స్ పాత్ర సూర్యకి ఊహించిన దానికంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత సూర్య మార్కెట్ మరింత పెరిగిందనే చెప్పాలి. దీంతో విక్రమ్ సెకండ్ పార్ట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న సినిమ్ కంగువ. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు 38 భాషల్లో విడుదలయ్యే పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది.

Suriya: నడవడానికి ఇబ్బంది పడుతున్న సూర్య.. ప్రమాదం తర్వాత ఎలా ఉన్నాడో చూశారా ?.. ఫ్యాన్స్ పూజలు..
Suriya

Updated on: Nov 28, 2023 | 8:42 AM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సూర్య ఒకరు. చిన్నవయసులోనే బాలనటుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. గజినీ సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆకాశం నీహద్దురా, జై భీమ్ సినిమాలతో ప్రశంసలు అందుకున్న సూర్య.. ఇటీవల కమల్ నటించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ పాత్రలో అదరగొట్టారు. రోలెక్స్ పాత్ర సూర్యకి ఊహించిన దానికంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత సూర్య మార్కెట్ మరింత పెరిగిందనే చెప్పాలి. దీంతో విక్రమ్ సెకండ్ పార్ట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న సినిమ్ కంగువ. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు 38 భాషల్లో విడుదలయ్యే పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. సిరుత్తై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇక ఇటీవలఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో గత వారం కంగువ షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో సూర్య స్వల్పంగా గాయపడ్డాడు. ఘటన విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందారు. తమ ఫేవరేట్ హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం బాగుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశాడు సూర్య. ఇక ఇటీవలే విశ్రాంతి సూర్య ముంబై వెళ్లిపోయాడు.

తన భార్య జ్యోతికతో కలిసి ముంబై వెళ్లిన సూర్యకు సంబంధించిన లేటేస్ట్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సూర్య కష్టంతో నడుస్తున్నాడు. సూర్యను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. అతను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా సూర్య పూర్తిగా కోలుకోవాలని ఆయన అభిమానులు చెన్నైలోని కాళికంపాల్ ఆలయంలో పూజలు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.