Suriya: ఫ్లాపులు వచ్చినా తగ్గని క్రేజ్.. కళ్లు చెదిరే ధరకు సూర్య సినిమా ఓటీటీ డీల్.. ఏకంగా అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం తన 45వ సినిమాతో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తన 46వ సినిమా కోసం టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో జతకట్టాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే అట్టహాసంగా జరిగాయి. అయితే షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది.

Suriya: ఫ్లాపులు వచ్చినా తగ్గని క్రేజ్.. కళ్లు చెదిరే ధరకు సూర్య సినిమా ఓటీటీ డీల్.. ఏకంగా అన్ని కోట్లా?
Suriya 46th Movie

Updated on: Jun 07, 2025 | 4:14 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో . కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. . స్వసిక, నాజర్, జోజు జార్జ్, కరుణాకరన్, సింగంపులి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మేడే కానుకగా విడుదలైన రెట్రో సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తమిళంలో బాగానే ఆడినా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రెట్రో ఆదరణకు నోచుకోలేదు. అంతకు ముందు కంగువా సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే సినిమాలు చేయడంలో సూర్య స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రెట్రో షూటింగ్ పూర్తి కాకముందే, నటుడు సూర్య తన 45వ చిత్రం కోసం దర్శకుడు, నటుడు RJ బాలాజీతో జతకట్టాడు. ఈ చిత్రంలో నటి త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత, షూటింగ్ త్వరలో పూర్తవుతుందని, సినిమా ఖచ్చితంగా పండుగ రోజున విడుదల అవుతుందని అన్నారు. దీపావళికి విడుదల అవుతుందా అని విలేకరులు అడిగినప్పుడు, ఆయన నవ్వుతూ, పండుగ రోజున ఉంటుందని అన్నారు.

రెట్రో సినిమా థియేటర్లలో ఉండగానే సూర్య వెంకీ అట్లూరితో జతకట్టాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో నటుడు సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరితో పాటు నటి మమిత బైజు, సంగీత స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ కూడా పాల్గొన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ గతంలో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ లక్కీ భాస్కర్ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇప్పుడు మళ్లీ వెంకీతోనే జత కట్టాడు.

ఇవి కూడా చదవండి

ఇది సూర్య నటిస్తోన్న 46వ చిత్రం. తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను దాదాపు 85 కోట్లకు చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి