Sundeep Kishan: బంపరాఫర్‌.. ‘ఊరు పేరు భైరవకోన’ టికెట్స్‌ పడేయద్దంటోన్న హీరో సందీప్‌ కిషన్‌.. ఎందుకంటే?

యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్ర ఊరు పేరు భైరవ కోనం. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్‌

Sundeep Kishan: బంపరాఫర్‌.. ఊరు పేరు భైరవకోన టికెట్స్‌ పడేయద్దంటోన్న హీరో సందీప్‌ కిషన్‌.. ఎందుకంటే?
Sundeep Kishan

Updated on: Feb 16, 2024 | 12:34 PM

యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్ర ఊరు పేరు భైరవ కోనం. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్‌. సినిమాను ఎలాగైనా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని చాలా చోట్లు అడ్వాన్స్‌ షోలను ఏర్పాటు చేశారు. వీటి నుంచే ఊరు పేరు భైరవకోనకు పాజిటివ్‌ టాక్‌ లభించింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది ఊరు పేరు భైరవకోన టీమ్‌. అక్కడ ప్రమోషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ మూవీ లవర్స్‌కు ఓబంపర్‌ ఆఫర్ ఇచ్చాడు సందీప్ కిషన్.

‘నా తరపున ఒక చిన్న పని చేయాలనుకుంటున్నాను. అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకొని మా సినిమాకు వస్తున్నారు. వారికి మనం ఏం ఇవ్వగలం అని చాలా సేపు ఆలోచించాను. అందుకే ప్రీమియర్ టికెట్స్ ఎవరెవరు, ఏ ఊళ్లో కొనుకున్నా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ టికెట్స్‌ను మీరు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న ఏ వివాహ భోజనంబు రెస్టారెంటుకు అయినా వెళ్లి చూపించి 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. వచ్చే 15, 20 రోజుల్లో ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది మా తరపున కృతజ్ఞత తప్పా ఇంకేమీ కాదు’ అని చెప్పుకొచ్చాడు సందీప్‌ కిషన్‌. ఈ సందర్భంగా 14 ఏళ్లుగా తనను ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడీ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో.

ఇవి కూడా చదవండి

సందీప్ కిషన్ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్..

మూడేళ్ల కష్టానికి తగిన ఫలితం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.