Sonu Sood: భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రముఖ నటుడు, దర్శకుడు సోనూసూద్ సతీమణి ఇటీవల ఓ కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారు ప్రమాదవశాత్తూ ట్రక్కును ఢీకొట్టడంతో సోనూసూద్ సతీమణి సోనాలీసూద్ తో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై సోనూసూద్ ఒక ట్వీట్ చేశాడు.

Sonu Sood: భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?
Sonu Sood

Updated on: Mar 26, 2025 | 8:02 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసుద్ భార్య సోనాలి సూద్ మంగళవారం (మార్చి 26) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె నాగ్‌పూర్‌ లోని మ్యాక్స్‌ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది సోనాలీ సూద్ తో పాటుఆమె సోదరి, సోదరి కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా తన భార్య ఆరోగ్య పరిస్థితిపై సోనూసూద్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. ‘‘మీ ప్రార్థనలు ఫలించాయి. మీ ప్రేయర్స్‌, మెసేజ్‌లకు కృతజ్ఞతలు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా భార్య సోనాలీ, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. మద్దతు విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ ప్రేమకు కృతజ్ఞుడిని’ అని ట్వీట్ లో పేర్కొన్నారు సోనూసూద్. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సోనుసూద్ భార్య సోనాలి, ఆమె సోదరి, సోదరి కుమారుడు కలిసి సోమవారం (మార్చి 24) రాత్రి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముంబై – నాగ్‌పూర్‌ సమృద్ధి హైవేపై వీరు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తూ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోనాలి, ఆమె సోదరి కొడుకుకు తీవ్రగాయాలవగా.. ఆమె సోదరి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనుసూద్ చివరిసారిగా ఫతే అనే సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిజ జీవిత సైబర్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సోనూసూదే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అంతే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్‌ రాజ్‌, నసీరుద్దీన్‌ షా, దివ్యేందు భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 10న విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోనూ సూద్ ఎమోషనల్ నోట్..

ప్రమాదంలో దెబ్బతిన్న సోనూ సూద్ భార్య కారు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.