AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: షూను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కు అండగా సోనూసూద్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఇటీవల, స్విగ్గీ డెలివరీ బాయ్ పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చి ఇంటి బయట షూ దొంగిలించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది స్విగ్గీ డెలివరీ బాయ్ ను టార్గెట్ చేస్తూ అతనిని వెంటనే తీసేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

Sonu Sood: షూను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కు అండగా సోనూసూద్.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Actor Sonu Sood
Basha Shek
|

Updated on: Apr 13, 2024 | 6:53 PM

Share

ఇటీవల, స్విగ్గీ డెలివరీ బాయ్ పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చి ఇంటి బయట షూ దొంగిలించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది స్విగ్గీ డెలివరీ బాయ్ ను టార్గెట్ చేస్తూ అతనిని వెంటనే తీసేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. దొంగతనం చాలా పెద్ద నేరమంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అదే సమయంలో మరికొంతమంది అతని దీన పరిస్థితిని చూసి కాసింత దయ చూపించాలంటున్నారు. ఇప్పుడిదే వీడియోపై ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించి నెటిజన్ల కు టార్గెట్‌గా మారారు. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చిన తర్వాత ఇంటి వెలుపల వదిలేసిన షూను చోరీ చేశాడు. ఇది అక్కడ ఉండే సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడం, వెంటనే నెట్టింట ప్రత్యక్షం కావడంతో తెగ వైరల్ గా మారింది. రోహిత్ అరోరా అనే వ్యక్తి గతంలో తన ఎక్స్ ఖాతాలో డెలివరీ బాయ్ బూట్లు దొంగిలిస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోపై స్పందించిన సోనూసూద్ ‘మీకు ఫుడ్‌ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్‌ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. కుదిరితే అతనికి కొత్త షూస్ కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమై ఉండొచ్చు. కాస్త దయతో వ్యవహరించడండి’ అని ట్వీట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

సోనూసూద్ చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సోనూసూద్‌ను విమర్శిస్తున్నారు. ‘మీ ట్వీట్ దొంగతనాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని, పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?’ అంటూ సోనూసూద్ పై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ‘నాకు ఏదైనా అవసరమైతే, ఎవరి ఇంట్లోనైనా ఏదైనా దొంగిలించడానికి నాకు అనుమతి ఉందా’ అని మరో ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు. ‘నేరాన్ని సమర్ధించడం కరెక్ట్ కాదు కదా బ్రో’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మొత్తానికి డెలివరీ బాయ్ కు అండగా నిలుద్దామనుకున్న సోనూసూద్ నెటిజన్లకు టార్గెట్ గా మారిపోయాడు.

షూ తో స్విగ్గీ డెలివరీ బాయ్.. వీడియో..

సోనూసూద్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.