
బుల్లితెరపై యాంకర్ గా పనిచేసిన ఓ సాధారణ కుర్రాడు ఇప్పుడు దక్షిణాదిలోని స్టార్ హీరోలలో ఒకరు. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో కథానాయకుడిగా కనిపించిన అతడు.. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం తమిళ సినీరంగంలోని స్టార్ హీరోలలో ఒకరిగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది దీపావళీ కానుకగా అమరన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శివకార్తికేయన్.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 22 సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతడి చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. 2025 నాటికి మొత్తం 25 సినిమాలను పూర్తి చేయాలని శివకార్తికేయన్ భావిస్తున్నట్లు టాక్. సినిమాలో నటుడిగా అరంగేట్రం చేయడానికి ముందు, శివకార్తికేయన్ విజయ్ టెలివిజన్‌లో యాంకర్‌గా పనిచేశాడు.
శివకార్తికేయన్ చివరి చిత్రం అమరన్‌కు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నటి సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో శివకార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత డైరెక్టర్ సుధా కొంగుర డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు విలన్‌గా ప్రముఖ నటుడు జయం రవిని ఎంపిక చేశారు.
ఈ నేపధ్యంలో శివకార్తికేయన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తి విలువ గురించి మాట్లాడడం వైరల్ అవుతోంది. శివకార్తికేయన్‌ను ఆ ఇంటర్వ్యూలో మీకు ఎంత ఆస్తి ఉందని ప్రశ్నించగా.. రూ.45,000 కోట్లు ఉంటుందని.. తాను అంబానియా అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..