AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Shobhana: పెళ్లికి దూరంగా సీనియర్ హీరోయిన్ శోభన.. కారణం ఏంటో తెలుసా..?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీరంగంలో విశేషమైన సేవలు అందించినందుకు నందమూరి బాలకృష్ణ, అజిత్, హీరోయిన్ శోభనకు పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా శోభనకు సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. శోభన వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు.

Actress Shobhana: పెళ్లికి దూరంగా సీనియర్ హీరోయిన్ శోభన.. కారణం ఏంటో తెలుసా..?
Shobana
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2025 | 5:15 PM

Share

ఒకప్పుడు దక్షిణాదిలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుంది. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె ప్రేమ, పెళ్లికి దూరంగానే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభన తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. నటి శోభన.. మార్చి 21, 1970న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 1980లో శ్రీకాంత్, కెఆర్ విజయ నటించిన మంగళ నాయకి చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా కథానాయికగా పరిచయమైన నటి శోభన 1984లో నటుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ఎస్‌బి ముత్తురామన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మదుల్‌ ఒరువన్‌ చిత్రంతో కథానాయికగా మారింది.

ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తెలుగు, కన్నడ, హిందీ వంటి 200 కి పైగా చిత్రాలలో నటించారు శోభన. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు శోభన. 2006లో సినీరంగంలో ఆమె చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.

ఇక ఇప్పుడు పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో ఆమెకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శోభనకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభన పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను అడగ్గా.. తనకు పెళ్లిపై నమ్మకం లేకనే వివాహం చేసుకోలేదని.. పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందని తెలిపింది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు