Hero siddharth: ‘పాన్‌ ఇండియా పదమేంటి? నాన్సెన్స్‌’.. హీరో సిద్దార్థ్ సంచలన కామెంట్స్

|

May 02, 2022 | 9:11 AM

హీరో సిద్ధార్థ్‌ మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. పాన్‌ ఇండియా పేరుతో వస్తున్న సినిమాలపై ఫైర్‌ అయ్యారు. ఈ పాన్‌ ఇండియా పదమేంటి? నాన్సెన్స్‌ అని రెచ్చిపోయారు సిద్ధార్థ.

Hero siddharth: పాన్‌ ఇండియా పదమేంటి? నాన్సెన్స్‌..  హీరో సిద్దార్థ్ సంచలన కామెంట్స్
Siddharth
Follow us on

పుష్ప(Pushpa), ట్రిపులార్(RRR), కేజీఎఫ్‌- 2(KGF-2) నాలుగు నెలల కాలంలో వచ్చిన ఈ మూడు సినిమాలు, పాన్‌ ఇండియా అంటూ వివిధ భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించాయి. వాస్తవానికి ఈ సినిమాల కంటే ముందే, ఇండస్ట్రీలో పాన్‌ ఇండియా అనే పదం పుట్టుకొచ్చింది. అటు సౌత్‌ సినిమాలు హిందీ బెల్ట్‌లోనూ దుమ్మురేపుతాయని మనోళ్లు ఫుల్‌ ఖుషీ అయిపోయారు. అయితే, సౌత్‌ యాక్టర్‌ సిద్ధార్థ్‌కు మాత్రం ఈ పాన్‌ ఇండియా అనే పదం అస్సలు నచ్చలేదు. ఇది ప్రాంతీయ భాషా సినిమాలను అగౌరవపరిచే పదమని అంటున్నారు సిద్ధార్థ. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌(Bollywood) నుంచి వస్తుందని, పాన్‌ ఇండియా సినిమా అంటే సౌత్‌ నుంచి వస్తుందన్న భావన దీనివల్ల కలుగుతోందన్నారు. అసలు ఏ సినిమా అయినా ఇండియన్‌ సినిమాయే అవుతుందని స్పష్టం చేశారు సిద్ధార్థ్‌. తాను 15 ఏళ్ల కిందట ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో క్రాస్‌ఓవర్‌ సినిమా అనే టాపిక్‌ నడిచేదని, హాలీవుడ్‌ రేంజ్‌కు ఎప్పుడు చేరుకుంటామని అడిగేవారని గుర్తు చేసుకున్నారు. ఇండియన్‌ సినిమాలను ఇండియన్‌ సినిమాలుగా ఎందుకు చూడరని అంటున్నారు సిద్ధార్థ. పాన్‌ ఇండియా ఓ కామెడీ పదం అని, చాలా అగౌరవకరమైనదని అంటున్నారు. అటు ఈ పాన్‌ ఇండియా పదంపై రియాక్ట్‌ అయ్యారు ఆర్‌. నారాయణమూర్తి. తెలుగు సినిమాలు ఇప్పుడిప్పుడే పాన్‌ ఇండియా రేంజ్‌కు వెళ్తున్నాయని, పిచ్చిపిచ్చి కామెంట్స్‌తో దాన్ని పాడు చేయొద్దని సూచించారు నారాయణమూర్తి. తెలుగు సినిమాలకు మరింత ప్రోత్సాహం అవసరమని స్పష్టం చేశారు.

Also Read: Weather News: మండుతున్న ఎండలు.. కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ