Siddarth : ఆ హీరో అంటే నాకు ప్రాణం.. ఎప్పటికీ ప్రేమిస్తుంటాను.. సిద్ధార్థ్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్. ప్రేమకథ చిత్రాలతో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ కు దూరంగా ఉంటూ తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే 3BHK సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు.

Siddarth : ఆ హీరో అంటే నాకు ప్రాణం.. ఎప్పటికీ ప్రేమిస్తుంటాను.. సిద్ధార్థ్ కామెంట్స్..
Siddharth

Updated on: Sep 13, 2025 | 6:37 PM

హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2002లో మణిరత్నం దర్శకత్వం వహించిన “కన్నతిల్ ముత్తమిట్టల్” చిత్రంలో చిన్న పాత్రతో సిద్ధార్థ్ సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్.. తెలుగులో వరుస హిట్స్ అందుకున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. దాదాపు 9 భాషలలో ఈ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో ఆయనకు అనేక సూపర్ హిట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సిద్ధార్థ్.. ఇప్పుడు ఎక్కువగా తమిళంలోనే నటిస్తున్నారు. ఇటీవలే 3BHK సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ తనకు ఓ హీరో అంటే ప్రాణమని.. ఎప్పటికీ అతడినే ప్రేమిస్తుంటానని అన్నారు. అతడు మరెవరో కాదు.. లోకనాయకుడు కమల్ హాసన్. ఆ ఇంటర్వ్యూలో, నటుడు సిద్ధార్థ్‌ను మీకు సినిమాల్లో ఇష్టమైన నటుడు ఎవరు అని అడిగారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

అందుకు సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ” నేను ఎప్పుడూ సినిమాల్లో కమల్ హాసన్ సర్‌ను ప్రేమిస్తున్నాను. ఆయనకు ముందు, నేను శివాజీ గణేషన్ సర్, ఎస్.పి. రంగారావు వంటి నటులను ప్రేమించాను. ఇప్పుడు కమల్ హాసన్ అంటే ప్రాణం ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

3BHK అనేది నటుడు సిద్ధార్థ్ నటించిన 2025 చిత్రం. ఈ చిత్రానికి శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఇందులో శరత్‌కుమార్, దేవయాని, సిద్ధార్థ్, మీటా రఘునాథ్ వంటి ప్రముఖులు నటించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. సిద్ధార్థ్ ప్రస్తుతం ఇండియన్ 3 లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీని గురించి ఎటువంటి సమాచారం విడుదల కాకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..