AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoban Babu: మహిళా అభిమాని కన్నీటి గాథ విని కంటతడి పెట్టిన శోభన్ బాబు.. వెంటనే..

కోడెత్రాచు షూటింగ్ సమయంలో శోభన్ బాబును కలిసిన ఓ అభిమాని తన విషాదగాథను వివరించింది. చిన్నతనం నుంచి శోభన్ బాబును ఆరాధిస్తూ వచ్చిన ఆమె.. కొడుక్కు కూడా ఆయన పేరే పెట్టుకుంది. శోభన్ బాబును కలిసిన వేళ రోడ్డు ప్రమాదంలో మరణించిన భర్త గురించి కన్నీళ్లతో వివరించింది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన శోభన్ బాబు.. ఆమెకు ధైర్యం చెప్పారు. అంతేకాదు..

Shoban Babu: మహిళా అభిమాని కన్నీటి గాథ విని కంటతడి పెట్టిన శోభన్ బాబు.. వెంటనే..
Shoban Babu
Ram Naramaneni
|

Updated on: Jan 14, 2026 | 5:06 PM

Share

అప్పట్లో  నటభూషణ శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన కోడెత్రాచు మూవీ యూనిట్.. షూటింగ్ నిమిత్తం మైసూర్‌లోని సుందరమైన బృందావన్ గార్డెన్స్‌కు చేరుకుంది. వారిద్దరిపై ఓ పాట షూట్ జరుగుతుండగా, రెండు టూరిస్ట్ బస్సులు అక్కడికి వచ్చాయి. అందులోంచి దిగిన జనం షూటింగ్ స్పాట్‌కు చేరుకుని శోభన్ బాబు, శ్రీదేవిలను చూసి ఆనందంతో మునిగిపోయారు. గుంటూరు నుంచి వచ్చామని చెప్పి, శోభన్ బాబుతో ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు తీసుకున్న తర్వాత అందరూ ఆనందంగా తిరిగి వెళ్లి బస్సెక్కారు. అయితే, వారిలో ఒక యువతి మాత్రం బస్సు ఎక్కకుండా శోభన్ బాబునే దీనంగా చూస్తూ నిలబడింది. ఆమె ఒడిలో చంటి బిడ్డ ఉన్నాడు. చిన్నోడి ముఖం పీక్కుపోయి, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆమెను చూడగానే శోభన్ బాబు గుండె తరుక్కుపోయింది. బస్సు డ్రైవర్ హారన్ కొడుతున్నా ఆమె కదలలేదు.

ఆమె పరిస్థితి అర్థం కాని శోభన్ బాబు, “ఏమ్మా అందరూ వెళ్లిపోయినా నువ్వు అలా ఉండిపోయావు? ఏమైంది?” అని లాలనగా అడిగారు. అంతే, ఆ యువతి ఒక్కసారిగా బావురుమని ఏడ్చేసింది. ఐదు నిమిషాలు అలా ఏడ్చి, చివరికి తన కథ చెప్పింది. ఊహ తెలిసినప్పటి నుంచి శోభన్ బాబు సినిమాలే చూస్తూ, ఆయన్నే అభిమానించిందని, ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే వారితో వాదనకు దిగేదని చెప్పింది. ఆమె పిచ్చి అభిమానం చూసి “శ్రీమతి శోభన్” అని అందరూ వెక్కిరించే వారని తెలిపింది. పెళ్లి వయసు వచ్చాక, శోభన్ బాబు పోలికలున్న యువకుడిని చూసి వివాహం చేసుకుంది. తొలిరాత్రి తన భర్త కూడా శోభన్ బాబు అభిమాని అని తెలియడంతో ఆమె పొంగిపోయింది. అప్పటి నుంచి శోభన్ బాబు వారింట్లో ఆరాధ్య దైవంగా మారారు. సంవత్సరంలోపే తల్లి అయ్యి, కొడుకు పుడితే పిల్లాడికి శోభన్ బాబు పేరే పెట్టుకున్నారు ఆ దంపతులు. “ఇతనేనా?” అని చంకలోని పిల్లాడిని చూస్తూ శోభన్ బాబు అడగ్గా, ఆమె తల ఊపింది. ఆ పిల్లాడిని చేతిలోకి తీసుకుని ముద్దాడిన శోభన్ బాబు, ఆమెను మళ్లీ ఏడుస్తుండగా సముదాయించి, “ఎందుకు ఏడుస్తున్నావు? అంతా నువ్వు అనుకున్నట్లే జరిగింది కదా?” అని ప్రశ్నించారు. అప్పుడు ఆమె అసలు విషాదం వెల్లడించింది. “రెండు నెలలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడు” అని చెప్పి మళ్లీ రోదించింది. ఆమె మాటలు విని శోభన్ బాబు షాక్ అయ్యారు. కాసేపు ఆయన మెదడు పని చేయడం మానేసినంత పని అయ్యింది. కారుతున్న కన్నీటిని కర్చీఫ్‌తో తుడుచుకుని, ఆమెకు ధైర్యం చెప్పారు. కొంత డబ్బును కవర్‌లో పెట్టి ఆమె చేతికి అందించి, భరోసానిచ్చి బస్సు ఎక్కించారు. ఈ సంఘటన శోభన్ బాబు మానవత్వాన్ని, ఆయన అభిమానుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను మరోసారి రుజువు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శోభన్ బాబును కదిలించిన అభిమాని కన్నీటి గాథ..
శోభన్ బాబును కదిలించిన అభిమాని కన్నీటి గాథ..
ఆ దేశంలో కాకరకాయలు చాలా రిచ్‌గురూ.. కేజీ ఎంతో తెలిస్తే
ఆ దేశంలో కాకరకాయలు చాలా రిచ్‌గురూ.. కేజీ ఎంతో తెలిస్తే
కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ ఒక్క చిట్కా చాలు
కెమికల్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారాలా? ఈ ఒక్క చిట్కా చాలు
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!
సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు!
సంక్రాంతి స్పెషల్‌.. తిరుగుప్రయాణానికి మరిన్ని రైళ్లు!
పిలిచి రూ.50 లక్షలు ఇచ్చాడు.. ఆ నటుడి గురించి రాజారవీంద్ర ఎమోషనల్
పిలిచి రూ.50 లక్షలు ఇచ్చాడు.. ఆ నటుడి గురించి రాజారవీంద్ర ఎమోషనల్
కేంద్ర బడ్జెట్‌లో తరచూ వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు
కేంద్ర బడ్జెట్‌లో తరచూ వినిపించే ముఖ్యమైన పదాలు – వాటి అర్థాలు
కాబోయే భర్తతో ఫుల్ చిల్.. సంక్రాంతి ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి!
కాబోయే భర్తతో ఫుల్ చిల్.. సంక్రాంతి ఎంజాయ్ అంటే ఇలా ఉండాలి!
3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ
3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ
మీ దరిద్రాలన్నీ పటాపంచల్ అవ్వాలంటే.. అమావాస్య రోజు ఇలా చేయండి
మీ దరిద్రాలన్నీ పటాపంచల్ అవ్వాలంటే.. అమావాస్య రోజు ఇలా చేయండి