బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ మూడు ముళ్లు బంధంలోకి అడుగు పెట్టాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్. గత ఏడాది జూన్ 3న రక్షితా రెడ్డితో కలిసి తన జీవితంలో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది మార్చిలో అమ్మానాన్నలుగా ప్రమోట్ అయ్యారు శర్వానంద్- రక్షితా రెడ్డి. తమ కూతురికి ‘లీలా దేవి మైనేని’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం సినిమాలతో పాటు కూతురి ఆలనా పాలనలోనూ బిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. విరామం దొరికినప్పుడల్లా భార్య, బిడ్డతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు శర్వానంద్. ఎక్కడికెళ్లాడో తెలియదు గానీ తన ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అలా తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తొలిసారిగా తమ కూతురి ఫేస్ ను రివీల్ చేశారీ క్యూట్ కపుల్. ఇందులో అమ్మ ఒడిలో కూర్చొని శర్వా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది లీలా.
ప్రస్తుతం సెలబ్రిటీలు తమ పిల్లల ఫొటోలను రివీల్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఒక వేళ ఫొటో పెట్టాల్సి వచ్చినా.. ఎమోజీలు యాడ్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా అటెన్షన్ వద్దనుకుని ఇలా చేస్తున్నారు. అయితే శర్వానంద్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన కూతురు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇన్ స్టా వేదికగా మొత్తం రెండు ఫొటోలను షేర్ చేసుకున్నాడు శర్వా. ఇందులో ఒక ఫొటోలో కప్పులో కాఫీ మీద మిస్టర్ అండ్ మిసెస్ మైనేని అండ్ లీలా పిక్ పంచుకోగా.. మరో ఫొటోలో తన కూతురు పిక్ షేర్ చేశాడు. ఇందులో శర్వా కూతురు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. బబ్లీ లుక్స్‌తో అచ్చం తండ్రిలాగే ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు.. ‘పాప చాలా క్యూట్ గా ఉంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఒకే ఒక జీవితం, మనమే చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు శర్వా. ప్రస్తుతం యువీ క్రియేషన్స్, వంశీ ప్రజెంట్స్ పతాకం పై ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మరో మూవీలో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి