
టాలీవుడ్ హీరోల దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని నాగచైతన్య బీటౌన్లో సినిమాలు చేసే ఛాన్స్ పట్టేసారు. తాజాగా మరో హీరో బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. తెలుగులో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ కానున్నారు. అది కూడా స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్ తోపాటు మరో టాలీవుడ్ యాక్టర్ నాజర్ కూడా నటించబోతున్నట్లుగా టాక్. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రాత్ భరుచ్ఛా కీలక పాత్రలలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్ దంతియా ఎంటర్ టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ ఏడాది మార్చి 18న అయోధ్య రామజన్మభుమిలో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కలికంగా ఆగిపోయింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సత్యదేవ్… గుర్తుందా శీతాకాలం, తిమ్మరుసు, గాడ్సే చిత్రాల్లో నటిస్తున్నాడు.