Chiranjeevi: ‘నీలాంటి నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం’.. సత్యదేవ్ పై మెగాస్టార్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమా కంప్లీట్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు

Chiranjeevi: నీలాంటి నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. సత్యదేవ్ పై మెగాస్టార్ ప్రశంసలు
Megastar Chiranjeevi And Sa

Updated on: Apr 28, 2022 | 6:10 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమా కంప్లీట్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలో కీలకపాత్ర కోసం సల్మాన్ ను తీసుకున్నారు మోహన్ రాజా.. ఇటీవలే సల్మాన్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశాడు కూడా.. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర లో విలక్షణ నటుడు సత్యదేవ్(Satya Dev)హీరోగా నటిస్తున్నాడు. తాజాగా సత్యదేవ్ మెగాస్టార్ ఉదేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు.. ఈ ట్వీట్ కు చిరు కూడా స్పందించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ అభిమానులను ఖుష్ చేస్తుంది. సత్యదేవ్ ట్వీట్ చేస్తూ.

అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది.మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది..అంటూ రాసుకొచ్చారు. దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ.. డియర్ సత్యదేవ్. థ్యాంక్యూ..నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం..ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..గాడ్ ఫాదర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం.. అంటూ మెగాస్టార్ సత్యదేవ్ ను ప్రశంసించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..

Happy Birthday Samantha : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. క్వీన్ ఆఫ్ హార్ట్స్‏గా నిలబెట్టిన సినిమాలు ఇవే..