ఆ హీరో యాక్టింగ్‌కు ఫిదా అయ్యాను.. ఆయన ఆరా, లుక్స్, వ్యక్తిత్వం సూపర్ అంటున్న సంపత్ రాజ్

టాలీవుడ్ లో విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సంపత్ రాజ్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు . కేవలం విలన్ పాత్రలే కాదు సహాయక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు నటుడు సంపత్ రాజ్.

ఆ హీరో యాక్టింగ్‌కు ఫిదా అయ్యాను.. ఆయన ఆరా, లుక్స్, వ్యక్తిత్వం సూపర్ అంటున్న సంపత్ రాజ్
Sampath Raj

Updated on: Jan 01, 2026 | 2:08 PM

తెలుగులో ఎంతో మంచి విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంపత్ రాజ్. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సంపత్ రాజ్ కు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, సహనటులు, దర్శకులతో తన అనుభవాలు, అలాగే తన వ్యక్తిగత ప్రాజెక్టుల గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు హీరోలు సంపత్ రాజ్‌ను విలన్‌గా తీసుకోవడానికి ఆలోచించేవారు అని, అలా తీసుకుంటే తాము మ్యాచ్ చేయలేమని భావించారని కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వాటిలో వాస్తవం లేదు అని ఆయన అన్నారు. తనకు అలాంటి విషయం తెలియదని, తనతో పనిచేసిన హీరోలందరూ ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినవారని స్పష్టం చేశారు సంపత్.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

మహేష్ బాబుతో సహా తాను ఎందరో హీరోలతో కలిసి నటించానని, మేకర్స్ తనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, హీరోల వల్ల సమస్యలు వచ్చాయన్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. శ్రీమంతుడు సినిమా తన కెరీర్‌లో మిర్చి తర్వాత ఎంతో ప్రభావం చూపిన చిత్రం అని అన్నారు. ఆ సినిమాకు దర్శకుడు కొరటాల శివ తనను పిలిచారని, స్క్రిప్ట్ పూర్తయ్యాక నాకు ఫోన్ చేసి, ఆ పాత్రను చేయాలని కోరారని తెలిపారు. ఆ చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందని, అది తనకు పెద్ద టర్న్ ఇచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. శ్రీమంతుడులోని కన్ఫ్రంటేషన్ సీన్ తనకు బాగా నచ్చిందని, ఊరు నుంచి ఏమి తీసుకున్నారో తిరిగిచ్చేయాలి అనే డైలాగ్‌తో కూడిన సన్నివేశం అద్భుతంగా పండిందని పేర్కొన్నారు.

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

మహేష్ బాబు నటన గురించి ప్రస్తావిస్తూ, ఆయన సహజమైన నటుడని సంపత్ రాజ్ ప్రశంసించారు. షాట్‌లో మహేష్ బాబు మనందరం రోజూ మాట్లాడుకున్నట్లే నటించడం వల్ల అది తెరపై ఎంతో ప్రభావం చూపుతుందని, లౌడ్ యాక్టింగ్ కాకుండా సెటిల్డ్‌గా ఉంటుందని తెలిపారు. ఆయన ఆరా, లుక్స్, వ్యక్తిత్వం స్క్రీన్‌పై మరింత పవర్ ను ఇస్తుందని అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌పై సంపత్ రాజ్ తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేశారు. త్రివిక్రమ్‌తో సినిమా తీయకపోయినా, ఆయనతో కూర్చుని మాట్లాడితే చాలు అని చాలా మంది అనుకుంటారని పేర్కొన్నారు. త్రివిక్రమ్ ఆలోచనా విధానం, ఆయన కూల్ స్వభావం తనకు బాగా నచ్చుతాయని, ఆయన సినిమాల్లోని గూస్ బంప్స్ కలిగించే క్షణాలు గొప్ప రచయితకు మాత్రమే సాధ్యమని అన్నారు. ఒక క్రియేటివ్ పర్సన్‌గా త్రివిక్రమ్ మైండ్‌లోకి వెళ్లి ఆయన ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవాలని తను కోరుకుంటానని వెల్లడించారు. తాను ఎప్పుడూ త్రివిక్రమ్‌కు మంచి స్క్రిప్ట్, మంచి క్యారెక్టర్ రాసిస్తే చేస్తానని చెబుతుంటానని, అందుకు త్రివిక్రమ్ క్వాలిటీ క్యారెక్టర్ రాసినప్పుడు 100% పిలుస్తాను, మీరు నా మైండ్‌లో ఉంటారు అని త్రివిక్రమ్ హామీ ఇచ్చారని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.