వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ శ్రీవిష్ణు (Sree Vishnu) తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం శ్రీ విష్ణు సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ లక్కీ మీడియా పై బెక్కెం వేణు గోపాల్, బెక్కెం బబిత నిర్మిస్తున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భిన్నమైన కథాంశంతో రూపొందించబడుతోంది. కాగా, అల్లూరి (Alluri) అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. టైటిల్ లోగోలో రెండు తుపాకులు కనిపిస్తున్నాయి. విష్ణు ముఖం కనిపించనప్పటికీ, శ్రీవిష్ణు ఖాకీ దుస్తులలో కనిపిస్తాడు. పోస్టర్ సూచించినట్లుగా పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడుతున్న ఈ చిత్రంలో సిన్సియర్ పోలీసుగా ఉన్నాడు.
యూనిఫామ్లో కనిపించిన విధంగా సినిమాలో అతని పేరు ఎ.ఎస్ . రామరాజు. ఇది గొప్ప పోలీసు ఆఫీసర్ కథ, ఇంతవరకు శ్రీవిష్ణు చేయనటువంటి పోలీసుగా కనిపించనున్నారు.ఈ ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీ ని పెంచుతోంది. శ్రీవిష్ణు సరసన కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. నాగార్జున వడ్డే (అర్జున్), ఎం విజయ లక్ష్మి మరియు గంజి రమ్య సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి షూటింగ్ చివరి దశలో ఉందని.. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సినిమాలో కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, మధుసూధన్ రావు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
A Sneak Peek ? from the Title Assault Launch of #ALLURI ?by the
Mass Maharaja @RaviTeja_offl?ing @sreevishnuoffl #PradeepVarma @rameemusic #RajThota @BekkemVenugopal #Babita @luckymediaoff @UrsVamsiShekar pic.twitter.com/yz3QyYZMKE
— BA Raju’s Team (@baraju_SuperHit) April 5, 2022
Also Read: Rashmi Gautam: యాంకరమ్మ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. రష్మీ లేటెస్ట్ ఇమేజెస్
Rashmika Mandanna: బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..
Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..
Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్పుల్ యాక్షన్తో అదరగొట్టిన విజయ్ దళపతి..