
టాలీవుడ్ నటుడు రవివర్మ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, నటనపై తనకున్న ప్యాషన్ గురించి కీలక విషయాలు తెలిపాడు. తన రాఖీ సినిమాలోని పాత్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పాడు. ఆ పాత్రను చూసి కొందరు ట్రామాకు గురైనట్లు, తమ ఇంటికి వచ్చి భయపడినట్లు చెప్పారన్నారు. అయితే, రాఖీ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు అయిందని, ప్రస్తుతం అందరూ కూడా తనను టాక్సీవాలాలో ప్రొఫెసర్‌గా చూస్తున్నారని, శంభాలలో రాములుగా చూస్తున్నారని రవివర్మ వివరించాడు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
శంభాల చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తన పాత్రకు చాలానే వీఎఫ్ఎక్స్ షాట్‌లు చేశారని, ఆ షాట్లు ఎలా ఉంటాయో ముందుగా చెప్పారని, దానికనుగుణంగా తన బాడీ లాంగ్వేజ్‌ను సిద్ధం చేసుకున్నానని చెప్పాడు. ఏదో తెలియని శక్తి తనను ఆవహించినప్పుడు, కోపం వచ్చినప్పుడు చేతులు పెంచుకోవడం లాంటివి సహజంగా చేశానని పేర్కొన్నాడు. అలాగే శంభాల సక్సెస్ మీట్‌లో వైరల్ అయిన సాయికుమార్, ఆదిల సంఘటనను ప్రస్తావిస్తూ.. మొబైల్ ఫోన్ల అధిక వినియోగంపై ఆందోళనను వ్యక్తం చేశాడు. ఆధార్, బ్యాంక్ ఖాతాలు, ఓటీపీలు లాంటివి ఫోన్‌కు అనుసంధానం కావడంతో ప్రజలు దానికి బానిసలయ్యారని, ఇది భవిష్యత్తు తరాలకు పెద్ద సమస్యగా మారవచ్చని హెచ్చరించాడు.
తాను ధూమపానం, మద్యపానం అలవాటు లేనివాడినని, అలాగే పెద్దగా భోజనప్రియుడిని కాదని రవివర్మ అన్నాడు. స్వీట్ల పట్ల మాత్రం తనకు బలహీనత ఉందని, అది మినహా పెద్దగా కష్టపడి కంట్రోల్ చేసుకునే అలవాట్లు లేవని తెలిపాడు. గత కొద్దిరోజులుగా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. వయస్సు పెరిగే కొద్దీ నటులు తమ ఫిజిక్‌ను పాత్రల కోసం మార్చుకోవాల్సిన అవసరం ఉందని రవివర్మ అభిప్రాయపడ్డాడు. హీరోలు ఒకే లుక్‌ను మెయింటైన్ చేయాల్సి ఉంటుందని, అయితే సపోర్టింగ్ ఆర్టిస్టులకు పాత్ర స్వభావానికి అనుగుణంగా మార్పులు అవసరమని చెప్పాడు.
టైప్‌కాస్టింగ్‌పై మాట్లాడుతూ.. మహిళలపై హింస లేదా డ్రగ్ అడిక్ట్ లాంటి లిమిటేషన్స్ ఉండే పాత్రలకు దూరంగా ఉంటానని రవి వర్మ స్పష్టం చేశాడు. అలాంటి పాత్రలు కథను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయే తప్ప, వాటిలో నటించడం వల్ల నటుడికి ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నాడు. ఘోస్ట్ సినిమాలోని తన పాత్రను ఉదాహరణగా చూపిస్తూ.. అది తన వ్యక్తిత్వంలో ఒక చిన్న భాగం మాత్రమేనని, కథకు ఎలాంటి అన్యాయం చేయలేదని తెలిపాడు. ఆహుతి ప్రసాద్, రావు రమేష్, బ్రహ్మాజీ, మురళీ శర్మ లాంటి నటుల పాత్రలను ప్రస్తావిస్తూ, వాటిలో ఎమోషన్స్, వైవిధ్యం ఉంటాయని, అలాంటి పాత్రలనే తాను కోరుకుంటానని, ఇక్కడే కూర్చోబెట్టేసే పాత్రలను చేయనని రవి వర్మ తేల్చి చెప్పాడు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..