టాలీవుడ్ అగ్ర‌న‌టుడికి న‌ట‌న‌పై అస‌లు ఇంట్ర‌స్ట్ లేద‌ట‌..!

టాలీవుడ్ అగ్ర‌న‌టుడికి న‌ట‌న‌పై అస‌లు ఇంట్ర‌స్ట్ లేద‌ట‌..!

నటనలో తన తండ్రి రావు గోపాలరావు పేరును నిల‌బెడుతున్నాడు రావు ర‌మేష్​. బాల‌య్య న‌టించిన ‘సీమసింహం’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయ‌మైనా కూడా ‘కొత్త బంగారులోకం’, ‘గమ్యం’ సినిమాలు ఆయ‌న‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్ర‌త్యేక‌మైన డైలాగ్ డెలివ‌రీ, టిపిక‌ల్ బాడీ లాంగ్వేజ్ ఆయ‌న్ను తెలుగు ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు సెప‌రేట్ ఐడెంటీని క్రియేట్ చేశాయి. ప్ర‌స్తుతం అగ్ర‌క‌థానాయ‌కులు సినిమాల్లో మంచి పాత్ర‌లతో దుమ్మురేపుతోన్న రావు రమేశ్ కి న‌ట‌న‌పై అస్స‌లు ఇంట్ర‌స్ట్ లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే ఓ […]

Ram Naramaneni

|

Apr 13, 2020 | 8:33 AM

నటనలో తన తండ్రి రావు గోపాలరావు పేరును నిల‌బెడుతున్నాడు రావు ర‌మేష్​. బాల‌య్య న‌టించిన ‘సీమసింహం’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయ‌మైనా కూడా ‘కొత్త బంగారులోకం’, ‘గమ్యం’ సినిమాలు ఆయ‌న‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్ర‌త్యేక‌మైన డైలాగ్ డెలివ‌రీ, టిపిక‌ల్ బాడీ లాంగ్వేజ్ ఆయ‌న్ను తెలుగు ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు సెప‌రేట్ ఐడెంటీని క్రియేట్ చేశాయి. ప్ర‌స్తుతం అగ్ర‌క‌థానాయ‌కులు సినిమాల్లో మంచి పాత్ర‌లతో దుమ్మురేపుతోన్న రావు రమేశ్ కి న‌ట‌న‌పై అస్స‌లు ఇంట్ర‌స్ట్ లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు.

రావు రమేశ్‌ ముందుగా డైర‌క్ట‌ర్ గా స‌త్తా చాటుదామ‌నుకున్నార‌ట‌. ఈ విషయం వాళ్ల అమ్మగారికి తెలియ‌జేయ‌గా.. “డైరెక్ష‌న్ అంటే 24 క్రాప్ట్స్ తెలిసి ఉండాలి. ద‌ర్శ‌క‌త్వం అంటే లెన్స్‌లు తెలిస్తే స‌రిపోదు. జీవితం తెలియాలి. ముందు ముళ్ల బాట ఉంటుంది. తర్వాత వెలుగు కనిపిస్తుంది. ప్రస్తుతం నటించు. నీకు నటన చాలా తేలిక” అని ఆన్స‌ర్ ఇచ్చిందట. అలా డైరెక్ట‌ర్ కావాల్సిన నేను నటుడయ్యానని ఓ తెలిపాడు రావు రమేశ్‌.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu