టాలీవుడ్ స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భళ్లాలదేవుడుగా ప్రపంచ ఖ్యాతి పొందిన రానా.. సినిమా షూటింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు ఈ భళ్లాలదేవుడికి కోపం నషాళానికంటింది. ఓ విమానయాన సంస్థపై ఆగ్రం కట్టలు తెంచుకుంది. అది ఒక పనికిమాలిన సంస్థ అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. మని ఆ బళ్లాల దేవుడికి అంత కోపం ఎందుకొచ్చింది? అసలేం జరిగింది? తన లగేజీ పోవడమే రానా కోపానికి కారణం. అవును రానా లగేజీ మిస్ అయ్యింది. ఇండిగో ఎయిర్ సర్వీస్‌లో ప్రయాణించిన సందర్భంలో రానా లగేజీ మిస్ అయ్యింది. దాంతో రానా తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యాడు.
ఇండిగో సర్వీస్‌పై అసహనం వ్యక్తం చేశాడు రానా. ఈ మేరకు ట్వీట్ చేసిన రానా.. ఇండిగో ఒక వరస్ట్ సర్వీస్ అంటూ రానా ట్వీట్ చేశాడు. ప్రయాణ సమయంలో తన లగేజీ మిస్ అయ్యిందంటూ రానా ఆగ్రహం వ్యక్తం చేశాడు. టైమింగ్స్, లగేజీ ట్రాకింగ్ సరిగా లేవని అసహనం వ్యక్తం చేశాడు. రానా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలోనూ ఇండిగో సర్వీస్‌పై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా ఆ సర్వీస్ తీరు మారడం లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
India’s worst airline experience ever @IndiGo6E !! Clueless with flight times…Missing luggage not tracked…staff has no clue ? can it be any shittier !! pic.twitter.com/odnjiSJ3xy
— Rana Daggubati (@RanaDaggubati) December 4, 2022
Maybe engineers are good staff is clueless !! You might need to do smthing proper. https://t.co/KRNJkKfCmx
— Rana Daggubati (@RanaDaggubati) December 4, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..